Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Amit Shah Strong Counter To China Over Border Issues

Amit Shah: చైనాకు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్.. ఒక్క అంగుళం కూడా తీసుకోలేరు

Published Date :April 10, 2023 , 6:08 pm
By NTV WebDesk
Amit Shah: చైనాకు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్.. ఒక్క అంగుళం కూడా తీసుకోలేరు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Amit Shah Strong Counter To China Over Border Issues: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనపై చైనా అభ్యంతరం చేయగా, అందుకు ఆయన తాజాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘భారత ప్రాదేశిక సమగ్రతను’ ఏ ఒక్కరూ ప్రశ్నించలేరని చురకలంటించారు. ‘మన భారత భూభాగంలో ఒక్క అంగుళం కూడా ఎవరూ తీసుకోలేరు’’ అని తేల్చి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు గ్రామం, భారతదేశానికి తూర్పు వైపున ఉన్న కిబితూ నుండి అమిత్ షా ‘వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014కి ముందు ఈశాన్య ప్రాంతమంతా అస్తవ్యస్తంగా ఉండేదని, అయితే ప్రధాని మోడీ తీసుకొచ్చిన ‘లుక్ ఈస్ట్’ విధానం కారణంగా గత 9 ఏళ్లలో ఈశాన్య ప్రాంతం ఇప్పుడు దేశాభివృద్ధికి దోహదపడే ప్రాంతంగా పరిగణించబడుతుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో అమిత్ షా భారత సైన్యాన్ని, సరిహద్దు పోలీసులను కొనియాడారు. ‘‘సరిహద్దు ప్రాంతాల్లో మన ఐటీబీపీ జవాన్లు, సైన్యం పగలు, రాత్రులు శ్రమిస్తున్నందున.. ఈరోజు దేశం మొత్తం ప్రశాంతంగా నిద్రపోగలుగుతోంది. ఈరోజు మన భారత్‌పై ఏ ఒక్కరూ డేగకన్ను వేయలేరని మనం గర్వంగా చెప్పుకోవచ్చు’’ అని పేర్కొన్నారు.

Kolkata Knight Riders: కేకేఆర్ చారిత్రాత్మక రికార్డ్.. 16 ఏళ్లలో ఇదే తొలిసారి

గత వారం అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను తమ భూభాగానికి చెందినవిగా చైనా పేర్కొంటూ, వాటికి పేర్లు మార్చింది. జాంగ్‌నన్ చైనా భూభాగమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ పేర్కొన్నారు. అంతేకాదు.. జాంగ్‌న‌న్‌లో భార‌తీయ అధికారులు ప‌ర్యటించ‌డం త‌మ భౌగోళిక సార్వభౌమ‌త్వాన్ని ఉల్లంఘించడం అవుతుందని.. స‌రిహ‌ద్దుల్లో శాంతి, సామ‌ర‌స్యత‌కు విఘాతం ఏర్పడుతుంద‌ని ఆయ‌న అన్నారు. అయితే.. భారత్ మాత్రం అరుణాచల్ ప్రదేశ్ దేశంలో విడదీయరాని భాగమని ఎప్పుడూ చెప్తూనే ఉంది. చైనా తన స్వంత ఆవిష్కరణ పేర్లను పెట్టడం వల్ల గ్రౌండ్ రియాలిటీ మారదని కూడా తేల్చి చెప్పింది. దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. ‘‘చైనా ఇలాంటి ప్రయత్నాలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు ఇలాంటి ప్రయత్నాల్ని మేము తిప్పికొట్టాం. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని భాగం. చైనా ఆయా ప్రాంతాల పేర్లను మార్చినంత మాత్రాన గ్రౌండ్ రియాలిటీ ఎప్పటికీ మారదు’’ అంటూ చెప్పుకొచ్చారు. మునైటెడ్ స్టేట్స్ కూడా.. స్థానిక ప్రాంతాల పేర్లు మార్చి, అరుణాచల్ ప్రదేశ్‌ను తమ భూభాగమని చెప్పుకోవడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించింది.

KA Paul: ట్రంప్ అరెస్ట్ అవుతాడని గతంలోనే చెప్పాను.. కేఏ పాల్ హాట్ కామెంట్స్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah
  • Amit Shah Arunachal Pradesh Tour
  • Arunachal Pradesh
  • China vs India
  • India-China border clash

తాజావార్తలు

  • Amaravati Capital: ఏపీ రాజధాని అమరావతి.. గెజిట్ విడుదల చేసిన కేంద్రం

  • Lip Kiss Incident : స్టార్ హీరోయిన్‌కు పబ్లిక్ వేదికపై బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని

  • Virat Kohli Dhurandhar 2 Review: “ధురంధర్-2” చూసి విరాట్ కోహ్లీ షాక్.. సినిమాపై కింగ్ హాట్ రివ్యూ!

  • Naga Shaurya : శ్రీదేవి నా లక్కీ చార్మ్ కావాలి అని కోరుకుంటుంన్నా..

  • Donald Trump: మనలోనే ‘‘గూఢచారి’’ ఉన్నాడు.. మీడియాకు ట్రంప్ వార్నింగ్..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions