Site icon NTV Telugu

Amit Shah: మావోయిస్టులతో కాల్పుల విరమణ ప్రసక్తే లేదు.. కావాలంటే లొంగిపోండి..

Amit Shah

Amit Shah

Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మావోయిస్టులకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. మావోల నుంచి కాల్పులు విరమణ ప్రతిపాదన వచ్చిన తర్వాత, ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టులతో కాల్పుల విరమన ప్రసక్తే లేని ఆదివారం అన్నారు. శాంతిని కోరుకునే వారు వెంటనే లొంగిపోవాలనే హెచ్చరికలు జారీ చేశారు. “ఇప్పటివరకు జరిగింది పొరపాటు అని, వారు లొంగిపోవాలనుకుంటున్నందున కాల్పుల విరమణ కోరుతూ ఒక లేఖ సర్క్యులేట్ అవుతోంది. కాల్పుల విరమణ ఉండదు. వారు లొంగిపోవాలనుకుంటే, కాల్పుల విరమణ అవసరం లేదు – మీ ఆయుధాలను వదిలిపెట్టండి. పోలీసులు ఒక్క తూటా కూడా కాల్చరు,’’ అని అమిత్ షా అన్నారు. మార్చి 31, 2026 నాటికి భారతదేశం నక్సలిజం నుంచి విముక్తి పొందుతుందని అమిత్ షా మరోసారి ప్రకటించారు. సాయుధ కార్యకలాపాలను అంతం చేయడం వల్లే సమస్య పరిష్కారం అవుతుందని ఆయన చెప్పారు.

Read Also: JR NTR : నొప్పితోనే ఈవెంట్ కు తారక్.. ఇబ్బంది పడుతూనే..

ఇటీవల మావోయిస్టు ప్రతినిధి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ పేరుతో ఒక లేఖ జారీ అయింది. దీనిపై అమిత్ షా మాట్లాడారు. ఈ లేఖ, వాయిస్‌లను ప్రామాణికమైనవే అని ధ్రువీకరించినట్లు ఛత్తీస్‌గఢ్ హోం మంత్రి విజయ్ శర్మ చెప్పారు. అయితే, తమ నిజాయితీ నిరూపించుకోవడానికి వారు ముందు రాష్ట్రవ్యాప్తంగా అమర్చిన ఐఈడీలను తొలగించాలని అన్నారు.

కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులకు తీవ్ర ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. వరసగా కేంద్ర నాయకత్వం భద్రతా దళాల చేతిలో హతమవుతున్నారు. మే నెలలో నారాయణపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 25 మంది మావోయిస్టులు మరణించారు. ఇందులో పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు హతమయ్యాడు.గత వారం జార్ఖండ్ హజారీ బాగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సహదేవ్ సోరెన్‌తో పాటు మరో ఇద్దరు మావోలు హతమయ్యారు. సహదేవ్‌పై రూ. 1 కోటి రివార్డు ఉంది. ఈ ఘటనల తర్వాత సీనియర్ కేంద్ర కమిటీ సభ్యురాలు, సీనియర్ లీడర్ కిషన్ జీ భార్య పోతుల పద్మావతి అలియాస్ సుజాత నాలుగు దశాబ్ధాల అజ్ఞాతం తర్వాత లొంగిపోయింది.

Exit mobile version