Amit Shah: బాబ్రీ మసీదు వాళ్లతో కలవడం కన్నా, 20 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉంటాం
- బెంగాల్ ఎన్నికల్లో సంచలనంగా హుమాయున్ కబీర్ వీడియో..
- బీజేపీతో డీల్ ఉందని చెబుతున్న వీడియోపై ప్రకంపనలు..
- బాబ్రీ మసీదు వాళ్లతో కలిసేది లేదని చెప్పిన అమిత్ షా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు కీలక మైనారిటీ నేత హుమాయున్ కబీర్ వ్యవహారం సంచలనంగా మారింది. ఆయనపై జరిగిన స్టింగ్ ఆపరేషన్ ఇప్పుడు రాజకీయాలకు కేంద్రంగా మారింది. బీజేపీ-హుమాయున్ కబీర్ మధ్య రూ. 1000 కోట్ల డీల్ జరిగిందని ఓ వీడియోలో హుమాయున్ కబీర్ చెబుతున్నట్లు కనిపించడంతో వివాదం ముదిరింది. బెంగాల్ మాల్దాలో బాబ్రీ మసీదు నిర్మిస్తూ వార్తల్లో నిలిచిన కబీర్ ఇప్పుడు ఈ వీడియోతో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
Read Also: Shocking: మేకప్ సామాగ్రి తక్కువైందని పెళ్లి క్యాన్సిల్…
Also Read
- Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
- Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
- Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
- UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
అయితే, ఈ వ్యవహారంతో స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ‘‘బాబ్రీ మసీదు నిర్మించే వారితో కలిసి పనిచేయడం కన్నా, మరో 20 ఏళ్లు మేము ప్రతిపక్షంలో ఉండటానికి సిద్ధం’’ అని ప్రకటించారు. ఇప్పుడు హుమాయున్ కబీర్ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై విచారణ జరిపించాలని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ వీడియోలో తాను బీజేపీ నాయకులతో ఒప్పందం చేసుకున్నట్లు కబీర్ చెబుతున్నట్లు ఉంది. అయితే, ఇది ఏఐతో చేసిన వీడియో అని కబీర్ ఆరోపించారు. తనను అప్రతిష్టపాలు చేయడానికి టీఎంసీ ఇలాంటి పనులు చేస్తోందని ఆరోపించారు. ముస్లిం ఓట్లు కోల్పోతామనే భయంతో టీఎంసీ తనపై ఇలాంటి ప్రచారాన్ని చేస్తుందని కబీర్ అన్నారు. దీనిపై పరువు నష్టం కేసు పెడతానని బెదిరించారు.
ఈ వీడియోను బీజేపీ ఖండించింది. హుమాయున్ కబీర్, బీజేపీలు ఉత్తర-దక్షిణ ధ్రువాల లాంటివని ఇవి ఎప్పటికీ కలవవని అమిత్ షా అన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇలాంటివి 2000 వీడియోలను క్రియేట్ చేయగలదని ఆయన ఆరోపించారు. దీనికి ముందు మాజీ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. కబీర్ రూ. 1000 కోట్లు కాదు కదా, రూ. 100 కోట్లకు కూడా అర్హత లేని వ్యక్తి అని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!