Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం కర్ణాటకలో పర్యటించారు. దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరులో సెంట్రల్ అరెకానట్ మరియు కోకో మార్కెటింగ్ మరియు ప్రాసెసింగ్ కో-ఆపరేటివ్ లిమిటెడ్ (క్యాంప్కో) స్వర్ణోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, జేడీయూపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. 18వ శతాబ్దపు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్‌ను కాంగ్రెస్, జేడీ(ఎస్)లు విశ్వసించాయని, ఈ రెండు పార్టీల వల్ల కర్ణాటకకు ఎలాంటి మేలు జరగలేదని ఆయన ఆరోపించారు. బీజేపీ మాత్రం 16వ శతాబ్దపు తుళువ రాణి ఉల్లాల్ రాణి అబ్బక్క చౌటా స్పూర్తితో సుసంపన్నమైన పాలన అందిస్తోందని ఆయన అన్నారు.
Read Also: Viral: ఆ ప్రాంతంలో ప్లేట్ తన్నుతూ భర్తలకు భోజనం పెడతారు.. ఎందుకో తెలుసా?
కాంగ్రెస్ అవినీతికి పాల్పడిందని.. ప్రతిపక్ష పార్టీ కర్ణాటకను గాంధీ కుటుంబానికి ఏటీఎంగా ఉపయోగించుకుందని ఆరోపించారు. టిప్పును నమ్మే జేడీఎస్, కాంగ్రెస్‌లకు ఓటేయాలా లేక రాణి అబ్బక్కపై విశ్వాసం ఉంచిన బిజెపికి ఓటేయాలా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో తదుపరి ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలి..? ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని దేశభక్తులా..? లేక కర్ణాటకను ఏటీఎంగా మార్చుకున్న గాంధీ కుటుంబ పార్టీ కాంగ్రెస్ కా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, జేడీయూ ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని.. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే కర్ణాటక అభివృద్ధి చెందిందని అమిత్ షా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతులు మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పను గుర్తుంచుకుంటారని.. ఆయన నాయకత్వంలోనే బెంగళూర్ అభివృద్ధి చెందిందని అన్నారు.