Amit Shah criticizes Congress: ‘‘ మోదీ చనిపోవాలి’’, ‘‘ మోదీ సమాధిని తవ్వుతాం’’ అంటూ కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయని, అయితే ఇవన్నీ పనిచేయవని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆయన దీర్ఘాయువుతో ఉండాలని 130 కోట్ల మంది ప్రార్థిస్తున్నారని అన్నారు. శుక్రవారం కర్ణాటక బీదర్ లో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, ఆప్ కోరికను దేవుడు వినడని అన్నారు. ఇలాంటి పార్టీలకు ఓటు వేయాలా..? అని ప్రశ్నించారు. ప్రధానిని ఎంత దూషించినా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ విజయం సాధించలేదరని అన్నారు. మీరు ఎంత బుదర చల్లితే అంతగా కమలం వికసిస్తుంది, బుదర మధ్య నుంచే సువాసన వెదజల్లడం కమలం స్వభావం అని అమిత్ షా అన్నారు.
Read Also: Rohit Sharma: టెస్ట్ మ్యాచ్ మూడు రోజులేనా.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన రోహిత్
జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు వారి స్వార్థ ప్రయోజనాలను మాత్రమే చూసకుంటున్నారని విమర్శించారు. ఈ రెండు కూడా కుటుంబ పార్టీలే అని, వారు ప్రజలు సంక్షేమం గురించి ఎప్పుడూ ఆలోచించరని అన్నారు. పీఎఫ్ఐ నిషేధం మోదీ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయమని కొనియాడారు. సిద్దరామయ్య గాంధీ కుటుంబానికి ఏటీఎంగా మారారని విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీ తడిచిపెట్టుకుపోయిందని అన్నారు. నాగాలాండ్ లో కాంగ్రెస్ కు సున్నా, మేఘాలయలో 3, త్రిపురలో 4 సీట్లకు మాత్రమే కాంగ్రెస్ పరిమితం అయిందని ప్రజలకు తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. కర్ణాటకకు ప్రభుత్వం చేసిన కృషిని హోంమంత్రి వివరించారు. అమిత్ షా సమావేశానికి వేలాదిగా ప్రజలు హాజరయ్యారు. కర్ణాటకను బీజేపీ అభివృద్ధి చేస్తోందని అన్నారు. పీఎం కిసాన్ యోజనతో రైతులక సంక్షేమానికి భరోసా ఇస్తున్నామని, రాష్ట్రంలో అభివృద్ధి, దేశ భద్రతకు ఓటేయాలని, మోదీకి, బీజేపీకి ఓటేయాలని అమిత్ షా కోరారు.
