Tamil Nadu Elections: స్టాలిన్, ఈపీఎస్, విజయ్: తమిళనాడు సీఎం అభ్యర్థులు పోటీ చేసేది ఇక్కడి నుంచే..
- తమిళనాడులో 5 స్థానాలపై అందరి దృష్టి..
- సీఎం అభ్యర్థుల పోటీతో నెలకొన్న ఆసక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Elections: తమిళనాడు అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది. గత కొన్ని దశాబ్ధాలుగా డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య పోరు నెలకొనగా, ఈ సారి మాత్రం విజయ్ రూపంలో టీవీకే బరిలో నిలించింది. ఇప్పటికే కూటముల మధ్య ఎన్నికల పొత్తులు, సీట్ల పంపణీ ఖరారైంది. ముఖ్యంగా, సీఎంగా అభ్యర్థులుగా ఉన్న ఎంకే స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్), విజయ్ కీలక స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు.
కొలత్తూర్ నుంచి స్టాలిన్:
Also Read
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
- Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ చెన్నై లోని కొలత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. చేపలు, కూరగాయల మార్కెట్‌లకు కేంద్రంగా ఉన్న చెన్నై వాయువ్య ప్రాంతంలోని ఈ అసెంబ్లీ డీఎంకేకు కంచుకోటగా ఉంది. 2011లో స్టాలిన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అయితే, ప్రత్యర్థి పార్టీల నుంచి పెద్ద పేర్లు లేకపోవడంతో స్టాలిన్ గెలుపు దాదాపు ఖాయమని నమ్ముతున్నారు.
ఎడప్పాడి నుంచి ఈపీఎస్:
అన్నాడీఎంకే చీఫ్, ప్రతిపక్ష నేత పళనిస్వామి సొంత నియోజవర్గమైన ఎడప్పాడి నుంచే పోటీ చేస్తున్నారు. 1989 నుంచి ఈ అసెంబ్లీ నుంచి పలుమార్లు ఆయన గెలుపొందారు. ఎడప్పాడిగా ఆయనకున్న గుర్తింపు ద్వారా స్థానికంగా నియోజకవర్గంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ స్థానం నుంచి డీఎంకే అభ్యర్థి సీ.కాశీ పోటీ చేస్తున్నారు.
పెరంబూర్ నుంచి విజయ్:
నటుడిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన తలపతి విజయ్ ఈ సారి ఈ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. చెన్నైలో ఉత్తర ప్రాంతమైన పెరంబూర్ చారిత్రాత్మకంగా కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉంది. కార్మిక వర్గం ఈ నియోజకవర్గంలో అధికంగా ఉంటుంది.
త్రిచి తూర్పు నుంచి కూడా విజయ్ పోటీ:
త్రిచి తూర్పు అసెంబ్లీ నుంచి కూడా విజయ్ పోటీ చేస్తున్నారు. డీఎంకేకు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ తరపును ఇనిగో ఎస్ ఇరుదయరాజ్ పోటీ చేస్తున్నారు. 2021లో ఈయన ఇక్కడ నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. ఈ స్థానంలో మైనారిటీ ఓట్లు కీలకంగా మారుతాయి.
కారైకుడి నుంచి సీమాన్ పోటీ:
కాంగ్రెస్ కంచుకోట కారైకుడి నుంచి ఎన్‌టీకే కోఆర్డినేటర్ సీమాన్ పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలోని హై ప్రొఫైట్ నియోజకవర్గాల్లో ఇది ఒకటి. సీమాన్ తన ప్రాంతీయ మూలాలపై ఆధారపడుతుండగా, కాంగ్రెస్ సంప్రదాయ ఓట్ బ్యాంక్‌ను నమ్ముకుంది. ఈ నియోజకవర్గంలో ముక్కులథోర్, దేవేంద్రకుల వెల్లాలర్లు, ముత్తరైయర్, చెట్టియార్లు అనే కీలక వర్గాలు గెలుపోటముల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
తాజావార్తలు
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
-
UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..