NTV Telugu Site icon

Loksabha: లోక్‌స‌భ‌లో అదానీ, జార్జ్ సోర‌స్‌ అంశాల‌పై గంద‌ర‌గోళం.. సభ వాయిదా!

Parlament

Parlament

Loksabha: పార్లమెంట్ లో ఈరోజు (డిసెంబర్ 12) కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభ ప్రారంభమైన క్షణం నుంచి అధికార, విపక్ష ఎంపీలు ఆందోళన బాట పట్టారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ వాయిదా వేశారు. ఆమెరికా వ్యాపార వేత్త జార్జ్ సోరస్ తో కాంగ్రెస్ పార్టీకి సంబంధాలు ఉన్నట్లు అధికార బీజేపీ ఆరోపిస్తుండగా.. అదానీ అంశంపై తక్షణమే చర్చ కొనసాగించాలని విపక్ష కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.

Read Also: Sadhguru: బిజినెస్‌మేన్‌ను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయడం మంచిది కాదు

ఇక, ఇరు పక్షాల స‌భ్యుల నినాదాల‌తో లోక్ సభ హోరెత్తిపోయింది. ప్రశ్నోత్తరాల సమయం పూర్తి కాగానే.. జీరో అవర్‌లో గందరగోళం స్టార్ట్ అయింది. ఎంపీ జ్యోతిమ‌ణి మాట్లాడుతూ.. ఓ వ్యాపారవేత్తకు, భారతీయ జనతా పార్టీకి లింకులు ఉన్నాయని ఆరోపించింది. అయితే సదరు వ్యాపార‌వేత్త పేరును రికార్డుల్లో చేర్చడం లేదని స్పీకర్ చెప్పుకొచ్చారు. దీంతో విప‌క్ష స‌భ్యులు ఆందోళనకు దిగారు.. కాంగ్రెస్ నేత‌ల‌కు, జార్జ్ సోర‌స్‌కు ఉన్న సంబంధాలపై చర్చ జరగాలని బీజేపీ నేత నిషికాంత్ దూబే డిమాండ్ చేశారు. భారత్ ను నిర్వీర్యం చేసేందుకు సోర‌స్, కాంగ్రెస్ పార్టీతో క‌లిసి ప‌ని చేస్తోంద‌ని విమర్శలు గుప్పించారు. దూబే వ్యాఖ్యలపై కాంగ్రెస్ స‌భ్యులు వెల్‌లోకి దూసుకుపోయిన భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.