Anurag Thakur: బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ‘కులం’ వ్యాఖ్యలు బీజేపీ వర్సెస్ ఇండియా కూటమిగా మారాయి. పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. ఈ మేరకు ఠాకూర్ ప్రసంగాన్ని ప్రధాని మోడీ పోస్ట్ చేసినందుకు పీఎంకే వ్యతిరేకంగా కాంగ్రెస్ సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు చేసింది. ఠాకూర్ వ్యాఖ్యలకు పీఎం మోడీ మద్దతు నిలవడంపై కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. మంగళవారం ఠాకూర్ మాట్లాడుతూ..‘‘ కులం తెలియన వారు కులగణన గురించి మాట్లాడుతూన్నారు’’ అని వ్యాఖ్యానించడం దుమారం రేపింది.
Read Also: Caste Row: కులం వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్.. ప్రధాని మోడీపై ఫిర్యాదు..
రాహుల్ గాంధీని ఉద్దేశించి ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అభ్యంతరం తెలియజేశారు. కులం గురించి ప్రస్తావించడం సరికాదని, ఆమోదయోగ్యం కాదని విమర్శించారు. వేరే వారి కులాన్ని మీరు ఎలా అడుగుతారు..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, అఖిలేష్ వ్యాఖ్యలపై ఠాకూర్ కూడా అంతే ధీటుగా స్పందించారు. గతంలో అఖిలేష్ యాదవ్ కులాన్ని ఉద్దేశించి ప్రశ్నించిన వీడియోలను ఆయన ఎక్స్ షేర్ చేశారు.
‘‘ గతంలో అఖిలేష్ యాదవ్ ఓ ప్రెస్‌మీట్‌లో ఒక పాత్రికేయుడిని కులం గురించి అడుగుతున్న వీడియోతో పాటు మరొకరి కులాన్ని గురించి చర్చిస్తున్న వీడియో’’ని అనురాగ్ ఠాకూర్ ఎక్స్‌లో షేర్ చేశారు. ‘‘మీరు కులం గురించి ఎలా అడిగారు అఖిలేష్ జీ’’ అంటూ ఆయన వ్యంగ్యంగా కామెంట్ చేశారు.
जाति कैसे पूछ ली अखिलेश जी ? pic.twitter.com/uaFujlDWrD
— Anurag Thakur (@ianuragthakur) July 31, 2024