Caste Row: కులం వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్.. ప్రధాని మోడీపై ఫిర్యాదు..
- ‘కులం’ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఫైర్..
- ప్రధాని మోడీపై సభాహక్కుల ఫిర్యాదు..
- అనురాగ్ ఠాకూర్‌కి మద్దతు నిలవడంపై కాంగ్రెస్ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Caste Row: లోక్‌సభ వేదికగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన ‘కులం’ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. రాహుల్ గాంధీని కులగణన డిమాండ్‌ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్‌తో పాటు దాని మిత్ర పక్షాలు బీజేపీని విమర్శిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలు చేసిన అనురాగ్ ఠాకూర్‌కి ప్రధాని నరేంద్రమోడీ మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీపై కాంగ్రెస్ సభహక్కుల ఉల్లంఘన ఫిర్యాదును చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జిత్ సింగ్ చన్నీ లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కి ఫిర్యాదు చేశారు.
Also Read
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
ఠాకూర్ చేసిన “కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలను” సభ కార్యకలాపాల నుండి తొలగించినట్లు చన్నీ తన లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ తొలగించబడిన ప్రసంగాన్ని ప్రధాని మోడీ ఎక్స్‌లో ట్వీట్ చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఠాకూర్ వ్యాఖ్యల్ని ఎక్స్ వేదిగా పోస్ట్ చేసి, ఇవి తప్పకవినాల్సిన వాస్తవాలు, ఇండీ కూటమి డర్టీ రాజకీయాలను బట్టబయటు చేసిందని వ్యాఖ్యానించారు.
ప్రధాని ఈ వ్యాఖ్యల్ని పోస్ట్ చేయడం ద్వారా ‘‘పార్లమెంటరీ ప్రత్యేక హక్కుల్ని తీవ్రంగా ఉల్లంగిచారు’’ అని కాంగ్రెస్ ఆరోపించింది. అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్వినియోగం, రాజ్యాంగ విరుద్ధం అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. మంగళవారం ఠాకూర్ సభలో మాట్లాడుతూ.. కులం తెలియనవారు కుల గణన గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. నన్నున ఎంత కావాలంటే అంత అవమానించవచ్చు, కానీ కుల గణణ పార్లమెంట్‌లో ఆమోదింపజేసుకుంటామనే విషయాన్ని మరిచిపోవద్దని అన్నారు.
This speech by my young and energetic colleague, Shri @ianuragthakur is a must hear. A perfect mix of facts and humour, exposing the dirty politics of the INDI Alliance. https://t.co/4utsqNeJqp
— Narendra Modi (@narendramodi) July 30, 2024
తాజావార్తలు
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
-
Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
-
Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్‌ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..