Anant Ambani-Radhika wedding: 50 జంటలకు సామూహిక వివాహాలు.. భారీ కానుకలు
- 50 జంటలకు సామూహిక వివాహాలు జరిపిన ముకేష్ అంబానీ ఫ్యామిలీ
- నూతన దంపతులకు భారీ కానుకలు
- జూలై 12న అనంత్ అంబానీ-రాధిక వివాహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ కుబేరుడు ముకేష్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలంటే మామూలుగా ఉంటాయి. అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. మార్చి 1 నుంచి 3 వరకు చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక త్వరలోనే ఈ జంట మూడు ముళ్లతో ఒక్కటి కాబోతుంది. దీన్ని పురస్కరించుకుని ముకేష్ అంబానీ దంపతులు 50 పేద జంటలకు మంగళవారం సామూహిక వివాహాలు జరిపించారు. అంతేకాకుండా ఎంతో ఖరీదైన బహుమానాలు కూడా అందజేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
ముంబై సమీపంలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్ సామూహిక వివాహాలకు వేదికైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, పెద్ద కుమారుడు ఆకాశ్, కోడలు శ్లోక, కుమార్తె ఈశా, అల్లుడు ఆనంద్ హాజరయ్యారు. కొత్త జంటల తరఫున బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోలాహలంగా కార్యక్రమం జరిగింది. అంతేకాకుండా కొత్త జంటలకు భారీగా కానుకలను అత్త నీతా అంబానీ, కోడలు అందజేశారు. బంగారు మంగళసూత్రం, ఉంగరాలు, ముక్కుపుడక, వెండి మెట్టెలు, పట్టీలు అందించారు. అలాగే పెళ్లి కుమార్తెకు రూ.1.01 లక్షల చెక్ అందించారు. అంతేగాకుండా ఒక ఏడాదికి సరిపడా సరకులు అందజేశారు. గ్యాస్ స్టవ్, మిక్సీ, ఫ్యాన్, పరుపులు, దిండ్లు, గిన్నెలు అందించారు. అతిథులందరికి భారీ విందు ఏర్పాటు చేశారు. నూతన దంపతులు ముకేష్-నీతా దగ్గర ఆశీర్వాదం తీసుకున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే రాధికతో అనంత్ అంబానీ వివాహం జులై 12న జరగనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో గల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరగనున్నాయి.



#WATCH | Navi Mumbai: Reliance Industries Chairman Mukesh Ambani and Nita Ambani present at the mass wedding of the underprivileged being organised as part of the wedding celebrations of Anant Ambani and Radhika Merchant. pic.twitter.com/CbHUMUZvZe
— ANI (@ANI) July 2, 2024
Navi Mumbai: Reliance Industries Chairman Mukesh Ambani and Nita Ambani at the mass wedding of the underprivileged, organised as part of the wedding celebrations of Anant Ambani and Radhika Merchant. pic.twitter.com/42PRvhRd96
— ANI (@ANI) July 2, 2024
#WATCH | Mumbai: On the mass-wedding event organised as part of the wedding celebrations of Anant Ambani- Radhika Merchant, Founder and Chairperson of Reliance Foundation Nita Ambani says, "I feel extremely happy seeing the newlywed couples here… I give my blessing to all these… pic.twitter.com/xO8c6l29YC
— ANI (@ANI) July 2, 2024
తాజావార్తలు
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?