NTV Telugu Site icon

Amazon: “ఆన్‌లైన్ లెర్నింగ్ అకాడమీ”కి గుడ్ బై చెప్పిన అమెజాన్.

Amazon

Amazon

Amazon To Shut Online Learning Academy: ప్రపంచవ్యాప్తంగా పలు టెక్ దిగ్గజాలు ఖర్చులను తగ్గించే పనిలో తమ ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, మెటా, గూగుల్ ఇలా పలు సంస్థలు తమ ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నాయి. కొన్ని సంస్థలు తమ కంపెనీ సేవల్లో కోతలు విధిస్తున్నాయి. ఇదిలా ఉంటే భారతదేశంలో కూడా ఈ పరిమాణాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం చూపిస్తున్నాయి. తాజాగా అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో నిర్వహిస్తున్న ఆన్‌లైన్ లెర్నింగ్ అకాడమీని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇ-కామర్స్ దిగ్గజం ఓ ప్రకటనలో వెల్లడించింది.

Read Also: Anti Hijab Protests: మహ్సా అమిని చంపబడలేదు, మరణించింది.. ఇరాన్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు

భారతదేశంలో హైస్కూల్ విద్యార్థుల కోసం అమెజాన్ తన ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించిన రెండేళ్లలోపు ఎటువంటి కారణం చూపకుండా మూసివేస్తున్నట్లు గురువారం తెలిపింది. కోవిడ్-19 సమయంలో వర్చువల్ లర్నింగ్ కోసం అమెజాన్ అకాడమి ప్లాట్‌ఫారమ్ ప్రారంభించింది. జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషణ్(జేఈఈ)తో సహా పలు పోటీ పరీక్షలకు సంబంధించి కోచింగ్ అందించింది. కోవిడ్-19 లాక్ డౌన్ తర్వాత ప్రస్తుతం కరోనా వ్యాప్తి దేశంలో తగ్గడంతో పాటు పాఠశాలలు ప్రారంభం కావడం, కోచింగ్ సెంటర్లు ప్రత్యక్షంగా సేవలను అందిస్తుండటంతో ఆన్‌లైన్ లెర్నింగ్ అకాడమీలు నష్టపోతున్నాయి. ఈ కారణంగానే అమెజాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ప్రముఖ ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌ బౌజూస్ 2,500 మంది ఉద్యోగులను తొలగిస్తామని గత నెలలో ప్రకటించింది.

ప్రస్తుతం పరిణామాలు ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌ దెబ్బగా మారాయి. ఇదిలా ఉంటే మరోవైపు టెక్ కంపెనీలు కూడా ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్భనం భయాల కారణంగా తమ సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. ప్రకటనలపై ఆధాయం తగ్గడంతో పాటు బ్రిటన్, అమెరికా వ్యాప్తంగా మాంద్యం పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో తక్కువ మందితోనే కంపెనీలను నడిపించేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే రానున్న 6-12 నెలల్లో తప్పకుండా మాంద్యం వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2008తో పోలిస్తే ఈ సారి మాంద్యం ప్రభావం చాలా ఉంటుందని చెబుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం, కోవిడ్ -19 పరిస్థితులు, చైనాలో ఉత్పత్తి తగ్గడం ఇలా అన్ని పరిణామాలు ఆర్థిక సమస్యలకు కారణం అవుతున్నాయి.