Site icon NTV Telugu

H-1B visa: అమెరికాలో ఏ కంపెనీ ఎక్కువ H-1B వీసాలను ఇచ్చిందో తెలుసా..?

H 1b Visas

H 1b Visas

H-1B visa:  విదేశీ ఉద్యోగులకు ఇచ్చే H-1B వీసాలపై ట్రంప్ సర్కార్ కొత్త నిబంధల్ని తీసుకువచ్చింది. విదేశీ ఉద్యోగుల్ని నియమించుకునే కంపెనీలు ఇప్పుడు ప్రభుత్వానికి 1,00,000 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. భారత కరెన్సీలో ఇది రూ. 88 లక్షలు. ఈ చర్య భారతీయ టెక్కీలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. H-1B వీసా హోల్డర్లలో దాదాపు 70 శాతం మంది భారతీయులే ఉన్నారు.

ఈ చర్య వల్ల చాలా యూఎస్ కంపెనీలు స్థానిక అమెరికన్లను నియమించుకుంటాయని, అమెరికన్ ప్రతిభకు ప్రాధాన్యత ఇస్తారని ట్రంప్ పరిపాలన చెబుతోంది. దీని ద్వారా, తక్కువ విలువ కలిగిన విదేశీ వర్కర్లు సొంత దేశాలకు పంపబడుతారని యూఎస్ వాణిజ్య కార్యదర్శి అన్నారు. H-1B వీసా వ్యవస్థ ఐటీ అవుట్ సోర్సింగ్ సంస్థల చేత దుర్వినియోగంగా మారుతోందని ట్రంప్ ఆరోపించారు. H-1B వీసా ప్రోగ్రామ్ అమెరికా జాతీయ భద్రతకు ముప్పు అని చెప్పారు.

Read Also: CM Chandrababu: అన్నదాతలు ఆందోళన చెందవద్దు.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం మాది..

H-1B వీసాలు ఎక్కువగా ఇచ్చిన టాప్-10 కంపెనీలు ఇవే:

* అమెజాన్ కామ్ సర్వీసెస్ LLC- 10,044
* టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ LLC- 5,505
* మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్- 5,189
* మెటా ప్లాట్‌ఫారమ్‌లు- 5123
* ఆపిల్ ఇంక్- 4,202
* గూగుల్ LLC – 4,181
* కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్ – 2,493
* JP మోర్గాన్ చేజ్ అండ్ కో – 2,440
* వాల్‌మార్ట్ అసోసియేట్స్ ఇంక్ – 2,390
* డెలాయిట్ కన్సల్టింగ్ LLP – 2353

Exit mobile version