Amarnath Yatra : అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
- అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
- భారీ వర్షాల కారణంగా ముందుజాగ్రత్త చర్యగా అధికారుల నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amarnath Yatra : భారీ వర్షాల కారణంగా ముందుజాగ్రత్త చర్యగా రెండు మార్గాల్లో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా శనివారం నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. గత రాత్రి నుంచి బల్తాల్, పహల్గాం మార్గాల్లో అడపాదడపా భారీ వర్షాలు కురుస్తున్నాయని వారు వెల్లడించారు. యాత్రికుల భద్రత కోసం ముందస్తు చర్యగా యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.
Read Also: Mayawati: తమిళనాడు బీఎస్పీ చీఫ్ దారుణ హత్య.. మండిపడిన మాయావతి
Also Read
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
3,800 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని సందర్శించి, సహజసిద్ధంగా ఏర్పడిన మంచు లింగాన్ని దర్శించుకున్న భక్తుల సంఖ్య 1.50 లక్షలు దాటింది. అనంతనాగ్‌లోని నున్వాన్-పహల్గామ్ మార్గం, గందర్బాల్లో బల్తాల్ మార్గాల గుండా జూన్ 29న ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర.. ఆగస్టు 19న ముగుస్తుంది. గత ఏడాది 4.5 లక్షల మంది యాత్రికులు అమర్‌నాథ్‌లోని మంచు లింగాన్ని దర్శించుకుని ప్రార్థనలు చేశారు.
నేడు భారీ వర్షాలు పడే అవకాశం లేదని.. అయితే గుహకు వెళ్లే ప్రాంతాలలో జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో అప్రమత్తతలో భాగంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అమర్నాథ్ ఆలయం వద్ద గరిష్టంగా 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని, రాత్రి సమయంలో ఈ ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాగల నాలుగు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాలు వేసింది.
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!