Amarnath Yatra: అమర్నాథ్ యాత్రికులకు షాకింగ్ న్యూస్.. 5 రోజుల్లోనే! అసలు ఏం జరిగింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amarnath Yatra: హిందూ సమాజంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అమర్నాథ్ క్షేత్ర యాత్ర ఈ నెల 3వ తేదీన అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మొత్తం 57 రోజుల పాటు సుదీర్ఘంగా సాగాల్సిన ఈ యాత్ర మొదలైన ఐదు రోజులకే ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకోవడం ఇప్పుడు భక్తులందరిని షాక్‌కు గురి చేసింది. ఈ యాత్ర ప్రారంభం నాటికి పవిత్ర గుహలో దాదాపు 5 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనమిచ్చిన మంచు శివలింగం, ఇప్పుడు పూర్తిగా అంతర్థానమైంది.
బాబా బర్ఫానీ (మంచు శివలింగం) ఇంత త్వరగా కరిగిపోవడానికి ప్రధాన కారణం భక్తుల భారీ రద్దీ, పర్యావరణ ప్రభావాలేనని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర కోసం దేశవ్యాప్తంగా ఏకంగా 4 లక్షల మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. యాత్ర ప్రారంభమైన మొదటి నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 86 వేల మంది యాత్రికులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇంత భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడం వల్ల గుహ పరిసర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరిగిపోయాయి. దీనికి తోడు గ్లోబల్ వార్మింగ్, పర్యావరణంలో వస్తున్న మార్పుల కారణంగా మంచు లింగం ఐదు రోజుల్లోనే కరిగిపోయింది. అయితే శివలింగం కరిగిపోయినప్పటికీ, పవిత్ర గుహ దర్శనం కోసం భక్తుల రిజిస్ట్రేషన్లు, యాత్ర యథావిధిగా కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.
Also Read
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
తాజావార్తలు
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!