Saudi Houthi Attack: సౌదీ అరేబియాపై హౌతీల భారీ దాడులు.. పాకిస్తాన్, టర్కీ ఏం చేస్తాయి.?
- సౌదీ అరేబియాపై దాడుల్ని తీవ్రం చేసిన హౌతీలు..
- సౌదీ దక్షిణ ప్రాంతంలోని నాలుగు నగరాలపై అటాక్..
- మక్కా ఒప్పందం తర్వాత దాడుల్ని తీవ్రం చేసిన ఇరాన్ ప్రాక్సీ..
- సౌదీకి పాకిస్తాన్, టర్కీ అండగా నిలుస్తాయా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saudi Houthi Attack: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ఓవైపు జరుగుతుంటే, ఇరాన్ ప్రాక్సీ యెమెన్‌లోని హౌతీలు సౌదీ అరేబియాపై విరుచుకుపడుతున్నారు. హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ దక్షిణ ప్రాంతాల్లో దాడులు చేశారు. ఖమీస్ ముషైత్, జజాన్, నజ్రాన్ నగరాల్లోని పౌర, ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడుల్లో 73 మంది గాయపడినట్లు సౌదీ తెలిపింది. గాయపడిన వారికలో పిల్లలు, మహిళలు ఉన్నారు. ఇదే కాకుండా సౌదీ చమురు మౌలిక సదుపాయాలపై హౌతీలు భారీ దాడులు చేస్తున్నారు. క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడుతున్నారు.
అయితే, ఇటీవల సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీలు కలిసి ‘‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’’ చేసుకున్నాయి. ఈ ఒప్పందంలో ఏ దేశంపై దాడి జరిగినా అది మూడు దేశాలపై దాడిగానే పరిగణిస్తామని చెప్పాయి. కానీ, సౌదీ అరేబియాపై హౌతీలు దాడులు చేస్తున్నప్పటికీ ఈ రెండు దేశాల నుంచి పెద్దగా ప్రతిస్పందన కనిపించడం లేదు. పాకిస్తార్, టర్కీలు సౌదీకి ఎలాంటి భద్రత, సైనిక మద్దతు అందిస్తాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Also Read
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
హౌతీలు గత కొన్ని వారాలుగా సౌదీ అరేబియాపై దాడుల్ని తీవ్రం చేశారు. జూలైలో సౌదీ పోర్టులపై నౌకా దిగ్భంధం ప్రకటించిన తర్వాత రెడ్ సీలో సౌదీకి చెందిన నౌకల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. అదే సమయంలో యెమెన్‌లో సౌదీ మద్దతు ఉన్న ప్రభుత్వ దళాలు, హౌతీల మధ్య పోరాటం కూడా ఉధృతమైంది. ఈ దాడులు కేవలం సౌదీ-హౌతీల వరకు మాత్రమే పరిమితమవుతాయా.? లేక మక్కా ఒప్పందంలో భాగంగా టర్కీ, పాకిస్తాన్ రంగంలోకి దిగుతాయా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!