Site icon NTV Telugu

High Court: “మతాంతర జంట”ను ఎలా నిర్భందిస్తారు.? పోలీసులపై కోర్టు ఆగ్రహం..

High Court

High Court

High Court: మతాంతర జంటను నిర్భందించినందుకు పోలీసులపై అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా మందలించింది. వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అక్టోబర్ 15న కోర్టు ప్రాంగణంలోనే మతాంతర జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు వారిని శనివారం న్యాయమూర్తులు సలీల్ కుమార్ రాయ్, దివేష్ చంద్ర సమంత్‌ల ధర్మాసనం ముందు హాజరుపరిచారు. షేన్ అలీ, రష్మీలను కస్టడీలోకి తీసుకోవడం ‘‘చట్టవిరుద్ధం’’అని ధర్మాసనం పేర్కొంది. ఎలాంటి ఆదేశాలు లేకుండా ఈ జంటను కస్టడీలోకి తీసుకున్నారని, వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Read Also: Bandla Ganesh : భారతీయ సినిమా ఇండస్ట్రీలో తదుపరి అల్లు అర్జున్ అతనే..

అమ్మాయి మేజర్ అని, ఏ అధికారి, ఏ చట్టబద్ధమైన సంస్థ ఆదేశాలు లేకుండా పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకోలేరని చెప్పింది. ఇది రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని పోలీసులను కోర్టు మందలించింది. అమ్మాయి, అబ్బాయితో ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉంటుందని ఆదేశించింది. ఈ జంట ఎక్కడికి వెళ్లాలని అనుకుంటున్నారో, అక్కడ వరకు ఎస్కార్ట్ ఇవ్వాలని శనివారం అలీఘర్ అక్రాబాద్ పోలీసులను ఆదేశించింది.

అమ్మాయిని వన్ స్టాప్ సెంటర్‌లో ఉంచాలని, ఆమెతో కలిసి నివసించే వ్యక్తి మతం వేరనే కారణంగా పోలీసులు నిర్భంధంలోకి తీసుకోవడం ఆమోదయోగ్యం కాదని, సామాజిక ఒత్తిళ్లతో, చట్ట అధికారం లేకుండా నిర్భందించడం చట్టబద్ధం కాదని కోర్టు చెప్పింది. పౌరుల స్వేచ్ఛను కాపాడేందుకు అధికారాన్ని ఉపయోగించాలని సూచించింది. మతాంతర జంట భద్రతను నిర్ధారించాలని ప్రయాగ్‌రాజ్ పోలీస్ కమిషనర్, అలీఘర్ ఎస్‌ఎస్‌పి, బరేలీ ఎస్‌ఎస్‌పిలను కోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 27న అక్రాబాద్ పోలీస్ స్టేషన్‌లో బాలిక తండ్రి నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని ఈ జంట రిట్ పిటిషన్‌లో కోరింది.

Exit mobile version