High Court: “మతాంతర జంట”ను ఎలా నిర్భందిస్తారు.? పోలీసులపై కోర్టు ఆగ్రహం..
- మతాంతర జంటను నిర్భందించిన పోలీసులు..
- పోలీసుల తీరుపై అలహాబాద్ హైకోర్టు ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: మతాంతర జంటను నిర్భందించినందుకు పోలీసులపై అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా మందలించింది. వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అక్టోబర్ 15న కోర్టు ప్రాంగణంలోనే మతాంతర జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు వారిని శనివారం న్యాయమూర్తులు సలీల్ కుమార్ రాయ్, దివేష్ చంద్ర సమంత్‌ల ధర్మాసనం ముందు హాజరుపరిచారు. షేన్ అలీ, రష్మీలను కస్టడీలోకి తీసుకోవడం ‘‘చట్టవిరుద్ధం’’అని ధర్మాసనం పేర్కొంది. ఎలాంటి ఆదేశాలు లేకుండా ఈ జంటను కస్టడీలోకి తీసుకున్నారని, వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Bandla Ganesh : భారతీయ సినిమా ఇండస్ట్రీలో తదుపరి అల్లు అర్జున్ అతనే..
Also Read
- Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసిన భారత్..
- Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
- Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
- Jantar Mantar: జంతర్ మంతర్‌లో నిరసనలు అవసరమా? ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
అమ్మాయి మేజర్ అని, ఏ అధికారి, ఏ చట్టబద్ధమైన సంస్థ ఆదేశాలు లేకుండా పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకోలేరని చెప్పింది. ఇది రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని పోలీసులను కోర్టు మందలించింది. అమ్మాయి, అబ్బాయితో ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉంటుందని ఆదేశించింది. ఈ జంట ఎక్కడికి వెళ్లాలని అనుకుంటున్నారో, అక్కడ వరకు ఎస్కార్ట్ ఇవ్వాలని శనివారం అలీఘర్ అక్రాబాద్ పోలీసులను ఆదేశించింది.
అమ్మాయిని వన్ స్టాప్ సెంటర్‌లో ఉంచాలని, ఆమెతో కలిసి నివసించే వ్యక్తి మతం వేరనే కారణంగా పోలీసులు నిర్భంధంలోకి తీసుకోవడం ఆమోదయోగ్యం కాదని, సామాజిక ఒత్తిళ్లతో, చట్ట అధికారం లేకుండా నిర్భందించడం చట్టబద్ధం కాదని కోర్టు చెప్పింది. పౌరుల స్వేచ్ఛను కాపాడేందుకు అధికారాన్ని ఉపయోగించాలని సూచించింది. మతాంతర జంట భద్రతను నిర్ధారించాలని ప్రయాగ్‌రాజ్ పోలీస్ కమిషనర్, అలీఘర్ ఎస్‌ఎస్‌పి, బరేలీ ఎస్‌ఎస్‌పిలను కోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 27న అక్రాబాద్ పోలీస్ స్టేషన్‌లో బాలిక తండ్రి నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని ఈ జంట రిట్ పిటిషన్‌లో కోరింది.
తాజావార్తలు
-
Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్‌నినో ప్రభావం’..
-
Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసిన భారత్..
-
Vishwanath and Sons Trailer: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
-
Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
-
Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!