Site icon NTV Telugu

Akhilesh: అఖిలేష్ యాదవ్ బిగ్ ప్లాన్.. యూపీ ఎన్నికల కోసం ఐ-ప్యాక్‌తో డీల్

Akhilesh

Akhilesh

త్వరలో దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో కీలక ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల తర్వాత దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో 2027 ప్రారంభంలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు ఇప్పటికే ఎత్తులు.. పైఎత్తులు వేస్తు్న్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు యోగి ప్రభుత్వం నడుస్తోంది. ఈ సారైనా అధికారం చేజిక్కించుకోవాలని అఖిలేష్ యాదవ్, మాయావతి ప్రణాళికలు రచిస్తున్నారు.

ఈ క్రమంలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ బారీ స్కెచ్ వేశారు. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచన మేరకు ఐ-ప్యాక్‌తో అఖిలేష్ యాదవ్ ఒప్పందం కుదుర్చుకున్నారు.

పార్టీ ప్రచారాన్ని జిల్లా, బూత్ స్థాయిలో తీసుకెళ్లేందుకు ఐ-ప్యాక్‌ను నియమించుకున్నట్లుగా అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఐ-ప్యాక్‌ను నియమించుకోవాలని స్టాలిన్, మమతా బెనర్జీ సలహా ఇచ్చారని చెప్పారు. ఇక ఐ-ప్యాక్ సూచన మేరకు మార్చి 28న ఎన్నికల సమర శంఖారావం పూరించాలని నిర్ణయం తీసుకున్నారు. నోయిడా ర్యాలీతో అఖిలేష్ యాదవ్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజలను కలవనున్నారు.

ఐ-ప్యాక్‌… ప్రముఖ రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ. ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడు కిరోన్మోయ్ నందా వెల్లడించారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC) ను ప్రశాంత్ కిషోర్ స్థాపించారు. ప్రస్తుతం దీనికి ప్రతీక్ జైన్ నాయకత్వం వహిస్తున్నారు. కీలక వ్యూహకర్తగా.. నాయకుడిగా పనిచేస్తున్నారు. ఇక 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 111 సీట్లు గెలుచుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ 37 సీట్లు గెలుచుకుంది.

Exit mobile version