Akhilesh Yadav: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయల కానులకు అదృశ్యమయ్యాయని ఆరోపించారు. ఎక్స్ పోస్టులో ఆయన ఈ సంచలన ఆరోపణలు చేశారు.
‘‘రామ మందిరానికి సమర్పించిన కోట్ల రూపాయల కానుకలు గల్లంతవ్వడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరాముని భక్తులకు అత్యంత సున్నితమైన వార్త. ఇది ఆలయ ట్రస్టుకు తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితి. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యావత్ సనాతన సమాజానికి శ్రీరామునిపై ఉన్న ప్రగాఢ విశ్వాసానికి ఇది నేరుగా సంబంధించిన విషయం కాబట్టి, కోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించాలని అభ్యర్థిస్తున్నాము. ప్రభుత్వ మౌనం అనుమానాస్పదంగా ఉంది.’’ అని ట్వీట్ చేశారు.
ఎస్పీ అధినేత చేసిన ఆరోపణలపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్పందించలేదు. ఈ వార్త వైరల్ అయిన తర్వాత ట్రస్ట్ నుంచి ఎలాంటి వివరణ, ఖండన రాలేదు. ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు ఎవరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరికొన్ని నెలల్లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లు రాబోతున్న నేపథ్యంలో అఖిలేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
समस्त विश्व में भगवान राम के उपासकों के लिए ये एक बेहद संवेदनशील समाचार है कि ‘राम मंदिर’ के चढ़ावे की करोड़ों की रकम गायब पायी गई है।
ये मंदिर ट्रस्ट के लिए अत्यंत शर्मनाक स्थिति है। कोई भी सफ़ाई देने के लिए सामने नहीं आना चाहता है।
न्यायालय से स्वतः संज्ञान लेने की माँग है…
— Akhilesh Yadav (@yadavakhilesh) June 7, 2026

