Site icon NTV Telugu

Akhilesh Yadav: సీఎం యోగి ఒక ‘‘చొరబాటుదారుడు’’.. అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు..

Akhilesh Yadav

Akhilesh Yadav

Akhilesh Yadav: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత అఖిలేష్ యాదవ్ ఆదివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి ఓ ‘‘చొరబాటుదారుడు’’ అంటూ మండిపడ్డారు. ఆయన ఉత్తరాఖండ్ నుంచి, ఉత్తర్ ప్రదేశ్‌లోకి వచ్చాడని, ఆయన సొంత రాష్ట్రానికి తిరిగి పంపించాలని అన్నారు. రామ్ మనోహర్ లోహియా వర్ధంతి సందర్భంగా ఆదివారం లక్నోలోని లోహియా పార్క్‌లో విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీ వద్ద నకిలీ లెక్కలు ఉన్నాయని, వాటిని నమ్మితే, తప్పిపోతారని అన్నారు.

‘‘వసలపై గణాంకాలు ఇస్తున్న వ్యక్తులు.. మాకు యూపీలో కూడా చొరబాటుదారులు ఉన్నారు. ముఖ్యమంత్రి ఉత్తరాఖండ్‌కు చెందినవారు. మేము అడిని ఉత్తరాఖండ్ పంపాలనుకుంటున్నాము. ఆయన చొరబాటుదారుడు మాత్రమే కాకుండా, సైద్ధాంతిక కోణం నుంచి కూడా చొరబాటుదారుడే’’ అని అఖిలేష్ అన్నారు. ఆయన బీజేపీ సభ్యుడు కాదని, మరొక పార్టీ సభ్యుడు అని, ఈ చొరబాటుదారుడిని ఎప్పుడు తొలగిస్తారు..? అని ప్రశ్నించారు.

Read Also: Bihar Elections: ఎన్డీయే కూటమిలో తేలిన సీట్ల లెక్కలు.. ఎవరికి ఎన్ని సీట్లు అంటే..

కొన్ని రాజకీయ పార్టీలు చొరబాటుదారుల్ని ఓటు బ్యాంకుగా పరిగణిస్తున్నాయని, గుజారత్, రాజస్థాన్ సరిహద్దుల్లో చొరబాటు ఎందుకు జరగట్లేదు అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశ్నించిన కొన్ని రోజుల తర్వాత అఖిలేష్ యాదవ్ నుంచి ఈ వ్యాఖ్యలు చేశారు. అఖిలేష్ ఇటీవల రాయ్‌బరేలీలో జరిగిన మూకదాడి గురించి మాట్లాడుతూ..క్రైమ్ డేటాను పరిశీలిస్తే యోగి ప్రభుత్వ హయాంలోనే దళితులపై గరిష్ట దాడులు జరిగాయని స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. ఇటీవల వాల్మీకి వర్గానికి చెందిన యువకుడిని చంపారని, దళితులు, వెనకబడిన వర్గాలపై పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతోందని చెప్పారు. హర్యానాలో ఇటీవల ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ ఆత్మహత్యను ప్రస్తావిస్తూ.. నేటికి కులం ఆధారంగా వివక్ష ఉందని, ఒక ఐపీఎస్ అధికారి ప్రాణాలు కోల్పోయారని, సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిపై బూట్లు విసిరారని అన్నారు.

Exit mobile version