దివంగత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ గ్రౌండ్లో అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంత్యక్రియలకు పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు తరలివచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మహారాష్ట్ర రాష్ట్ర మంత్రులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, ఏపీ నుంచి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. లక్షలాదిగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. తమ అభిమాన నాయకుడిని తలచుకుని కార్యకర్తలు కన్నీటి పర్యంతం అయ్యారు. అంత్యక్రియలను ఎంపీ సుప్రియా సూలే దగ్గరుండి పర్యవేక్షించారు. అతిథులను ఆహ్వానించడం దగ్గర నుంచి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఆమెను చూసుకున్నారు.
అజిత్ పవార్ బుధవారం బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో తుది శ్వాస విడిచారు. ముంబై నుంచి బారామతికి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తి విమానం కూలిపోయింది. దీంతో అజిత్ పవార్‌తో పాటు ఇద్దరు పైలట్లు, ఇద్దరు సహాయకులు ప్రాణాలు కోల్పోయారు. అజిత్ పవార్ మరణ వార్త తెలియగానే యావత్తు దేశం దిగ్భ్రాంతికి గురైంది.
అజిత్ పవార్ బ్యాగ్రౌండ్ ఇదే..
అజిత్ పవార్.. 22 జూలై 1952లో జన్మించారు. భార్య సునేత్ర పవార్. ఇద్దరు కొడుకులు పార్థ్ పవార్, జే పవార్ ఉన్నారు. ఏక్నాథ్ షిండే, ఫడ్నవిస్ ప్రభుత్వాల్లో ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఫడ్నవిస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. పృథ్వీరాజ్ చవాన్ , దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే మంత్రివర్గాల్లో కూడా డిప్యూటీ సీఎంగా కొనసాగారు. మొత్తం ఆరుసార్లు ఈ పదవిలో ఉన్నారు. 2022 నుంచి 2023 వరకు మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. 1991లో బారామతి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. పీవీ.నరసింహారావు కేబినెట్లో రక్షణ మంత్రిగా కూడా పని చేశారు. బారామతి నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
#WATCH | Baramati | Parth and Jay, sons of Maharashtra Deputy CM Ajit Pawar, light the funeral pyre as they perform the last rites of their father pic.twitter.com/RJpiVGtCu7
— ANI (@ANI) January 29, 2026
#WATCH | Last rites of Maharashtra Deputy CM Ajit Pawar being performed with State honours in Baramati pic.twitter.com/XvxAsbRdKw
— ANI (@ANI) January 29, 2026
#WATCH | Maharashtra: Mortal remains of Pinki Mali, who was a member of the crew on the ill-fated charter plane, brought to her residence in Mumbai.
All five people onboard, including Deputy CM Ajit Pawar, died in the accident. pic.twitter.com/HmHqdkJkLJ
— ANI (@ANI) January 29, 2026
#WATCH | Goa CM Pramod Sawant pays last respects to Maharashtra Deputy CM Ajit Pawar, in Baramati pic.twitter.com/DU0yt2snKE
— ANI (@ANI) January 29, 2026
#WATCH | Actor Riteish Deshmukh attends the last rites of Maharashtra Deputy CM Ajit Pawar, in Baramati pic.twitter.com/rV0Klhfl6v
— ANI (@ANI) January 29, 2026