Site icon NTV Telugu

Ajit Pawar: పూణెకు రానున్న అజిత్ పవార్ మృతదేహం..! భారీగా తరలివస్తున్న అభిమానులు

Ajit Pawar87

Ajit Pawar87

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతదేహం పూణెకు తరలించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. పూణెలో ఆయన నివాసానికి భార్య, పిల్లలు, బంధువులు చేరుకుంటున్నారు. ఇక ఢిల్లీ నుంచి శరద్ పవార్, సుప్రియా సూలే పూణెకు బయల్దేరారు. ఇక ఎన్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పూణెలోని అజిత్ పవార్ నివాసానికి చేరుకుంటున్నారు. ఎప్పుడు అంత్యక్రియలు జరిగిస్తారు అనేది ఇంకా కుటుంబ సభ్యులు వెల్లడించలేదు. ప్రస్తుతం అజిత్ పవార్ భౌతికకాయం బారామతి మెడికల్ కాలేజీలో ఉంది. అక్కడ నుంచి పూణెకు తరలించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: Gold Rates: పెళ్లిళ్ల సీజన్‌ ముందు షాక్.. భారీగా పెరిగిన పసిడి ధర

బుధవరం ఉదయం 8:10 గంటలకు ముంబై నుంచి విమానం బారామతికి బయల్దేరింది. ఉదయం 8:45 గంటలకు ల్యాండింగ్‌కు సిద్ధపడుతుండగా ఒక్కసారిగా విమానం కూలిపోయింది. విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా సమీపంలోని గుట్టపై కూలిపోయింది. అయితే ప్రమాదం జరగగానే మంటలు అంటుకున్నాయి. దీంతో అజిత్ పవార్‌తో అందులో ఉన్న మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో శరీరాలు కాలిపోయాయి. ఇక అజిత్ పవార్ మృత పట్ల రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version