Air India: ఢిల్లీ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం AI-183 సాంకేతిక కారణాల వల్ల రష్యాలోని క్రాస్నోయార్స్క్ అంతర్జాతీయ విమానాశ్రయం (UNKL)లో ల్యాండ్ చేయబడింది ఈ మేరకు విమానయాన సంస్థ సమాచారం ఇచ్చింది. విమానం దారి మళ్లించిన తర్వాత క్రాస్నోయార్స్క్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని ఎయిర్ ఇండియా ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ప్రయాణీకులకు రక్షణ కల్పించేందుకు సంబంధిత అధికారులతో కలిసి పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Also: Peddavagu: పెద్దవాగులో చిక్కుకున్న వారందరూ సేఫ్..
కాగా, బోయింగ్ 777 విమానంలో 225 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇది కాకుండా 19 మంది విమాన సిబ్బంది కూడా ఉన్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది యొక్క భద్రత, శ్రేయస్సు మా మొదటి ప్రాధాన్యత అని ఎయిర్ ఇండియా చెప్పుకొచ్చింది. ఏడాది వ్యవధిలో ఇదే మార్గంలో ఎయిర్ ఇండియా విమానం ఈ విధంగా రష్యాలో ల్యాండ్ కావడం ఇది రెండోసారి. గతేడాది జూన్‌లో ఎయిరిండియాకు చెందిన బోయింగ్ విమానం కూడా సాంకేతిక సమస్యలతో ఒక రోజు నిలిచిపోయింది. దీంతో విమాన ప్రయాణికులను మగదాన్ ఎయిర్‌పోర్టులో దింపేసిన తర్వాత రోజు ప్రయాణికులను ఎక్కించుకోవడానికి అమెరికాకు ఎయిర్ ఇండియా విమానం వెళ్లిపోయింది.