Air India : తప్పిన మరో ఘోర విమాన ప్రమాదం.. ఎయిరిండియా టైం అస్సలు బాలేదుగా..!
- ఫుకెట్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం
- విమాన ముందరి చక్రం మొరాయించడంతో ఉద్రిక్త పరిస్థితి
- రన్‌వే ఐదు గంటల పాటు మూసివేత
- ప్రయాణికులందరూ సురక్షితమని ఎయిర్ ఇండియా ప్రకటన
Air India Express incident Phuket : భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన విమానం బుధవారం థాయిలాండ్‌లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. విమానం ముందు చక్రం (Nose Wheel)లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.
ఢిల్లీ నుండి ఫుకెట్ వెళ్లిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం, ల్యాండింగ్ సమయంలో రన్‌వేపైకి రాగానే దాని ముందు చక్రం మొరాయించింది. విమానం రన్‌వే మధ్యలోనే నిలిచిపోవడంతో ఇతర విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. భద్రతా కారణాల దృష్ట్యా విమానాశ్రయ అధికారులు తక్షణమే రన్‌వేను మూసివేసి, విమానాన్ని అక్కడి నుండి తొలగించే ప్రక్రియను చేపట్టారు.
Also Read
- Barrier Free Tolling: భారత్‌లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్‌కు గుడ్‌బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
Adani Total Gas: LPG కొరత మధ్య.. 18% పెరిగిన అదానీ గ్యాస్ స్టాక్.. రూ. 550 దాటి భారీ లాభాలు
ఈ సాంకేతిక లోపం కారణంగా ఫుకెట్ విమానాశ్రయం రన్‌వే సుమారు ఐదు గంటల పాటు మూతపడింది. దీనివల్ల ఫుకెట్‌కు రావాల్సిన , అక్కడి నుండి వెళ్లాల్సిన డజన్ల కొద్దీ విమానాలు రద్దయ్యాయి, కొన్ని దారి మళ్లించబడ్డాయి. వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. విమానాన్ని సురక్షితంగా రన్‌వే నుండి తొలగించిన తర్వాతే అధికారులు రాకపోకలను పునరుద్ధరించారు.
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ స్పందిస్తూ, ప్రయాణికుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత అని పేర్కొంది. విమానంలో ఉన్న ప్రయాణికులు , సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని, వారికి అవసరమైన సహాయం అందిస్తున్నామని వెల్లడించింది. సాంకేతిక లోపానికి గల కారణాలపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.
ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లోనూ భారత్ డామినేషన్.. అభిషేక్, ఇషాన్ కిషన్ అరాచకం!
తాజావార్తలు
-
Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
-
Rakasa : ‘రాకాస’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
-
AshuReddy : నటి అషు రెడ్డిపై నమోదైన చీటింగ్ కేసు వివరాలు..పెద్ద స్కెచ్చే
-
IPL Historic Day: బ్యాట్స్మెన్ల మెరుపులు, భారీ స్కోర్లు, రికార్డు ఛేజింగ్‌లు.. ఐపీఎల్ చరిత్రలో చారిత్రాత్మక రోజు!
-
Gayapadda Simham: తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’లో శ్రీ విష్ణు మేజిక్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!