Site icon NTV Telugu

MiG-21: మిగ్-21 విమానాలను నిలిపేసిన ఐఏఎఫ్.. కారణం ఇదే..

Mig 21

Mig 21

MiG-21: ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) మిగ్-21 జెట్ ఫ్లీట్ ను నిలిపివేశాయి. మే 8న రాజస్థాన్ హనుమాన్ గఢ్ గ్రామంలో మిగ్ -21 బైసన్ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. సూరత్‌గఢ్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన మిగ్-21 సాంకేతిక కారణాలతో క్రాష్ అయింది. వ్యవసాయ పనులు చేసుకుంటున్న ముగ్గురు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. యుద్ధవిమానం సాధారణ శిక్షణలో ఉండగా.. ప్రమాదానికి గురైంది. పైలెట్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణాలు తెసుకునేందుకు విచారణ ప్రారంభం అయింది. దీనికి గల కారణాలపై పరిశోధన జరిగే వరకు మిగ్-21 ఎగరకుండా మొత్తం విమానాలను నిలిపేసింది.

Read Also: Assam: “నో జీన్స్, లెగ్గింగ్స్”.. గవర్నమెంట్ టీచర్లకు డ్రెస్ కోడ్..

మిగ్-21 ఎయిర్‌క్రాఫ్ట్ వేరియంట్‌లు ఐదు దశాబ్దాలుగా భారత వైమానిక దళంలో పనిచేస్తున్నాయి. దశలవారీగా వీటిని తొలగించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుత ఐఏఎఫ్ కేవలం మూడు మిగ్-21 స్క్వాడ్రన్‌లు మాత్రమే పనిచేస్తున్నాయని, వీటన్నింటిని 2025 వరకు దశలవారీగా తొలగించనున్నారు. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మూడు మిగ్-21 బైసన్ వేరియంట్లతో సహా 31 యుద్ధ విమాన స్క్వాడ్రన్‌లు ఉన్నాయి. మిగ్-21 విమానాలు 1960ల్లో ఐఏఎఫ్ లోకి చేర్చబడ్డాయి. మిగ్-21 విమానాలు ఇటీవల తరుచుగా క్రాష్ అవుతున్నాయి. వీటి వల్ల సుశిక్షుతులైన పైలెట్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధునాతన మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ తో పాటు LCA మార్క్ 1A మరియు LCA మార్క్ 2లతో సహా స్వదేశీ విమానాలను వాయుసేనలోకి చేర్చుకోవాలని చూస్తోంది.

Exit mobile version