తమిళనాడులో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ కీలక నేత దారుణ హత్యకు గురయ్యారు. అన్నాడీఎంకే ముఖ్య నేతను దుండగులు హత్య చేశారు. చెన్నైలోని పెరంబూరుకి చెందిన ఇలంగోను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అర్థరాత్రి ఇలంగో ఇంటి సమీపంలో కత్తులతో దుండగులు దాడి చేశారు. రాజకీయ విభేదాలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యలో మొత్తం ఎనిమిది మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు ఐదు మంది అరెస్ట్ చేశారు. మిగిలిన వారికోసం గాలింపు చేపట్టారు. కాగా, ఇలంగో మాజీ సీఎం ఈపీఎస్ వర్గానికి చెందిన ముఖ్య నేత. ప్రస్తుతం పెరంబూరు నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్నారు.
Also Read:G20 Summit 2023: జీ–20 సదస్సుకు విశాఖ ముస్తాబు.. నేటి నుంచి ఆంక్షలు..