Divya – Arnav: కొత్త ట్విస్ట్.. మరో వ్యక్తితో దివ్య గర్భం.. భర్త రివర్స్ ఎటాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arnav Reveals Shocking Secrets About Divya Sridhar: తన భర్త ఆర్నావ్ మరో నటితో రాసలీలలు నడుపుతున్నాడని.. తనకు, తన బిడ్డకు భర్త నుంచి ప్రాణహాని ఉందని నటి దివ్య శ్రీధర్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే! అయితే.. ఇప్పుడు ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. దివ్య చెప్తున్నవన్నీ అబద్ధాలేనని.. తనకు తెలియకుండా, మరో వ్యక్తితో కలిసి గర్భం తీసుకునే ప్రయత్నం చేస్తోందని అతడు సాక్ష్యాలతో సహా ముందుకొచ్చాడు.
అసలేం జరిగిందంటే.. కర్ణాటకకు చెందిన దివ్య శ్రీధర్(35)కు 2012లో ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. ఈ జంటకు ఒక పాప కూడా ఉంది. అయితే.. భర్తతో మనస్పర్థలు రావడం వల్ల, అతనితో విడాకులు తీసుకుంది. కట్ చేస్తే.. సీరియల్స్‌లో నటిస్తున్న క్రమంలో దివ్యకు సహనటుడు ఆర్నావ్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో.. ఈ ఏడాది జూన్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భం దాల్చింది. అయితే.. ఆమెకు అంతకుముందే పెళ్లై, ఒక పాప కూడా ఉందన్న విషయం ఆర్నావ్‌కు ఇటీవల తెలిసింది. దీంతో ఈ విషయం ఎందుకు దాచావంటూ అతడు భార్యతో గొడవపడ్డాడు. అప్పట్నుంచి ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే దివ్య తమ పెళ్లి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాటిని తొలగించమని ఆర్నావ్ ఆమెపై ఒత్తిడి చేశాడు. కానీ.. దివ్య అందుకు ఒప్పుకోలేదు.
Also Read
- Supreme Court: "ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
- Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
ఇంతలో.. తన భర్త మరో నటితో సంబంధం పెట్టుకున్నాడని కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అంతేకాదు.. ఆ నటిని నిలదీసేందుకు షూటింగ్ స్పాట్‌కి వెళ్తే, ఆమె బాటిల్‌తో కొట్టిందని, భర్త కూడా చిత్రహింసలకు గురి చేస్తున్నాడని చెప్పింది. అయితే.. ఆమె చెప్తున్నవన్నీ అవాస్తవాలేనని, తాను ఆమెని చిత్రహింసలకు గురి చేయడం కాదు కదా, కనీసం టచ్ కూడా చేయలేదన్నాడు. ఇంకా దివ్యనే తన మీద దాడి చేసిందంటూ.. తనకు గాయమైన ఫోటోని రివీల్ చేశాడు. తమ పెళ్లికి సంబంధించిన పోస్టుల్ని మాత్రమే డిలీట్ చేయమన్నానని, కుటుంబ సభ్యుల అంగీకారం వచ్చాక పోస్ట్ చేయమని చెప్పానన్నాడు. కానీ, అంతకుముందే ఆమె పోస్ట్ చేయడంతో తాను మాట్లాడ్డం మానేశానని, అప్పట్నుంచి ద్వేషం పెంచుకొని.. నన్ను నా కుటుంబాన్ని నాశనం చేస్తానని చెప్పి, ఇలా డ్రామాలు ఆడుతోందని బాంబ్ పేల్చాడు.
తాజావార్తలు
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!