Amitabh Jha: యూఎన్ శాంతి పరిరక్షక దళం కమాండర్ బ్రిగేడియర్ అమితాబ్ ఝా మరణం..
- ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళం కమాండర్ బ్రిగేడియర్ అమితాబ్ ఝా మరణం..
- సంక్షోభ గోలన్ హైట్స్ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉండగ ఘటన..
- ఆయన సేవలని కొనియాడిన భారత సైన్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amitabh Jha: ఇజ్రాయిల్, సిరియా సరిహద్దుల్లోని గోలన్ హైట్స్‌లో ఐక్యరాజ్యసమితి డిసెంగేజ్‌మెంట్ అబ్జర్వర్ ఫోర్స్(యుఎన్డిఓఎఫ్) డిప్యూటీ ఫోర్స్ కమాండర్ (డిఎఫ్‌సి)గా పనిచేస్తున్న బ్రిగేడియర్ అమితాబ్ ఝా మరణించినట్లు భారత సైన్యం తెలిపింది. ఆయన మరణించే సమయంలో మిషన్ యాక్టింగ్ ఫోర్స్ కమాండర్‌గా కూడా ఉన్నారు. ఆయన మరణం పట్ల భారత సైన్యం బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. జనరల్ ఉపేంద్ర ద్వివేది సహా సీనియర్ సైనిక కమాండర్లు సంఘీభావం ప్రకటించారు. ఆయన మృతికి కారణాలను ఆర్మీ వెల్లడించలేదు.
Read Also: Crime: ‘‘రా’’ ఏజెంట్‌గా నటిస్తూ, కెనడా మహిళపై అత్యాచారం..
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ప్రస్తుతం ఆయన భౌతికకాయం భారత్ చేరుకుంటుంది. దేశానికి, అంతర్జాతీయ సమాజానికి సేవ చేసిన ఆయనకు గౌరవప్రదమైన వీడ్కోలుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో గోలన్ హైట్స్ తీవ్ర ఉద్రిక్త ప్రాంతంగా ఉంది. 1974 నుండి UNDOF పర్యవేక్షణలో ఉన్న ఈ ప్రాంతం ఇజ్రాయెల్ మరియు సిరియా మధ్య ఒక బఫర్ జోన్. ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని నివారించేందుకు యోమ్ కిప్పూర్ యుద్ధం తర్వాత దీని స్థాపన జరిగింది.
గత కొన్ని నెలలుగా గోలన్ హైట్స్ ప్రాంతంలో సిరియన్ ప్రభుత్వ బలగాలు, తిరుగుబాటు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో ఉన్న శాంతి పరిరక్షణ దళం, సాధారణ ప్రజలు భద్రతా సమస్యలు ఎదుర్కొన్నారు. బ్రిగేడియర్ ఝాతో సహా శాంతి పరిరక్షక దళం కాల్పుల విరమణ ఒప్పందాలను పర్యవేక్షించడంలో, మానవతా ప్రయత్నాలను సులభతరం చేయడంలో, ఎదురుకాల్పుల్లో చిక్కుకున్న పౌరులకు భద్రత ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించారు.
తాజావార్తలు
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
-
Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!