ఢిల్లీ తరగతి గదుల కుంభకోణం కేసులో మాజీమంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లకు ఏసీబీ సమన్లు జారీ చేసింది. రూ.2,000 కోట్ల కుంభకోణం జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. జూన్ 6న హాజరుకావాలని సత్యేంద్ర జైన్‌కు, జూన్ 9న హాజరుకావాలని మనీష్ సిసోడియాకు సమన్లలో ఏసీబీ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Meghalaya: టూరిస్ట్ రాజాది హత్యగా తేల్చిన పోలీసులు.. భార్య సోనమ్ ఆచూకీ కోసం గాలింపు
ఈ ప్రాజెక్ట్‌ను అప్పటి ఆప్ ప్రభుత్వం 34 మంది కాంట్రాక్టర్లకు అప్పగించింది. వీరిలో ఎక్కువ మంది ఆప్‌తో అనుబంధంగా ఉన్నవారే ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ అధికార ప్రతినిధి హరీష్ ఖురానా, బీజేపీ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా, బీజేపీ మీడియా రిలేషన్స్ విభాగం నుంచి నీలకాంత్ బక్షి దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఏసీబీ ఈ చర్య తీసుకుంది. సెమీ-పర్మనెంట్ తరగతి గదుల నిర్మాణంలో ఖర్చులు పెరగడం, అవకతవకలు జరిగాయని ఫిర్యాదులో ఆరోపించారు. రూ.2,000 కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ ఆరోపించింది.
ఇది కూడా చదవండి: IPL 2025 Awards: ఐపీఎల్ విజేత ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా.. అవార్డ్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు ఒక అంచనా. ప్రాజెక్ట్ చేపట్టాక తరగతి గది నిర్మాణం అమాంతంగా పెరిగిపోయింది. మార్కెట్ రేటు కంటే అదనంగా పెరిగిపోయినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రూ.2,892 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 12,748 తరగతి గదులను నిర్మించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టెండర్ల ప్రకారం ఒక్కో తరగతి గదికి రూ.24.86 లక్షలు ఖర్చయింది. ఇది అంచనా వేసిన మార్కెట్ రేటు రూ.5 లక్షల కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ అయినట్లుగా ఆరోపించింది. ఈ ప్రాజెక్టును 34 మంది కాంట్రాక్టర్లకు అప్పగించారని, వీరిలో ఎక్కువ మంది ఆప్‌తో ముడిపడి ఉన్నారని చౌహాన్ తెలిపారు.
2015-16 సమావేశాల్లో ఖర్చు ఫైనాన్స్ కమిటీ (EFC) ఈ ప్రాజెక్టును కఠినమైన షరతుతో ఆమోదించిందని ఏసీబీ చీఫ్ మధుర్ వర్మ మీడియాకు తెలిపారు. జూన్ 2016 నాటికి మంజూరు చేయబడిన ఖర్చులోనే దీనిని పూర్తి చేయాలని.. భవిష్యత్తులో ఎటువంటి పెరుగుదలకు అవకాశం లేదన్నారు. అయితే దర్యాప్తులో ఆర్థిక ప్రణాళిక ఉల్లంఘన జరిగినట్లు తెలిసిందన్నారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని.. ఆప్ నాయకులు త్వరలో హాజరుకానున్న తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు.
