Abhishek Banerjee: మమత మేనల్లుడికి బిగుస్తున్న ఉచ్చు.. మరో కేసు నమోదు..
- మమతా మేనల్లుడి చుట్టు బిగుస్తున్న ఉచ్చు..
- అభిషేక్ బెనర్జీపై రెండో కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Banerjee: బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఓటమి తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మమతా బెనర్జీ పార్టీకి ఆ పార్టీ నేతలు వరసగా షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజీనామాలు చేయగా, మరికొందరు మమత తీరును, మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అహంకారాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎంపీ అభిషేక్‌పై మరో కేసు నమోదైంది. ఆయన చేసిన ఒక పోస్టు సమాజంలోని ప్రజల మధ్య చిచ్చు పెట్టేదిగా ఉందని, ‘‘అత్యంత బాధ్యతారహితమైనది’’ అభివర్ణిస్తూ అర్నబ్ కాంతి దాస్ భవానీపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మే 2న ఆయన చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ కాపీని కూడా ఫిర్యాదుతో సహా అందించారు.
ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో టీఎంసీని ఓడించేందుకు ఎన్నికల సంఘం తమ పూర్తి శక్తిని ఉపయోగిస్తోందని టీఎంసీ నేత కళ్యాణ్ బెనర్జీ చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ అభిషేక్ బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీ బంగ్లా బిరోధి గుజరాతీ ముఠాకు, వారి తొత్తు జ్ఞానేష్ కుమార్‌కు నా డైమండ్ హార్బర్ మోడల్‌కు కనీసం ఒక గీత కూడా పెట్టడానికి పది జన్మలు కూడా సరిపోవు. మీ దగ్గర ఉన్నదంతా తీసుకురండి. నేను యావత్ భారత యూనియన్‌కు సవాలు విసురుతున్నాను – ఫల్తాకు రండి. మీలో అత్యంత బలవంతులను పంపండి, ఢిల్లీ నుండి గాడ్ఫాదర్లలో ఒకరిని పంపండి. మీకు దమ్ముంటే, ఫల్తాలో పోటీపడండి’’ అంటూ అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
అయితే, ఈ సోషల్ మీడియా పోస్టులో ‘‘గుజరాతీ ముఠా’’ అని అనడం సమాజాన్ని విడగొట్టడమే అని, ముఠా అనే పదం నేరం, అండర్ వరల్డ్‌తో ముడి పడి ఉన్న పదం అని ఫిర్యాదుదారు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక సమాజాన్ని ముఠాగా ముద్రవేయడం చట్ట స్పూర్తికి , దేశ సామాజిక నిర్మాణా స్పూర్తికి వ్యతిరేకమని అన్నారు.
ఎన్నికల్లో రెచ్చగొట్టేలా మాట్లాడాడని ఇప్పటికే బిధాన్నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అభిషేక్ బెనర్జీపై కేసు నమోదైంది. మే 4 ఫలితాలు వెలువడిన రోజు అర్ధరాత్రి మిమ్మల్ని కాపాడటానికి ఎవరు వస్తారో చూస్తానంటూ బీజేపీ కార్యకర్తల్ని, సపోర్టర్లను బెదిరించేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై రాజీబ్ సర్కార్ అనే వ్యక్తి కేసు పెట్టాడు. తాజాగా నమోదైన కేసు రెండోది.
తాజావార్తలు
-
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్‌తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
-
West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?