Abhijeet Dipke: నా కొడుకు కష్టానికి ఫలితం దక్కింది.. అభిజిత్ దీప్కే తల్లి ఆనందం
- నా కొడుకు కష్టానికి ఫలితం దక్కింది
- అభిజిత్ దీప్కే తల్లి ఆనందం
- మహారాష్ట్రలో కుటుంబ సభ్యులు సంబరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన కొడుకు కష్టానికి ఫలితం దక్కిందని సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే తల్లి అనితా దీప్కే సంతోషం వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నెల రోజులకు పైగా ఢిల్లీ జంతర్‌మంతర్ దగ్గర ఆందోళన చేపట్టారు. ఈ ఉద్యమానికి దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, రాజకీయ నాయకులు మద్దతు తెలిపారు. మొత్తానికి శనివారం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో అభిజిత్ దీప్కే కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. స్వీట్లు పంచుకుంటూ వేడుకలు జరుపుకున్నారు.

Also Read
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో అభిజిత్ దీప్కే తల్లి అనితా దీప్కే మీడియాతో మాట్లాడుతో.. తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది మా కుటుంబానికి చాలా ప్రత్యేకమైన రోజు. నా కొడుకు చేసిన నిజాయితీ పోరాటానికి చివరకు ఫలితం దక్కింది. అతను మొదటి నుంచే తన డిమాండ్ నెరవేరాల్సిందేనని గట్టిగా చెప్పేవాడు. తన లక్ష్యాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గలేదు.’’ అని తెలిపారు. అయితే కొడుకు ఢిల్లీలో నిరసనలో పాల్గొంటున్న సమయంలో కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైందని చెప్పారు.
‘‘అతనితో పాటు చాలా మంది విద్యార్థులు ఉన్నప్పటికీ.. తల్లిదండ్రులుగా మాకు భయంగానే ఉండేది. జైపూర్‌లో అతనిపై దాడి చేసి చెంపదెబ్బ కొట్టిన ఘటన మాకు తీవ్ర బాధ కలిగించింది. ఆ రోజు రాత్రంతా మేము నిద్రపోలేకపోయాం.’’ అని భావోద్వేగానికి గురయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత తమ కుమారుడికి ఘన స్వాగతం పలకాలని నిర్ణయించుకున్నామని అనితా దీప్కే తెలిపారు. కుమారుడు ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకుంటామని పేర్కొన్నారు.
#WATCH | Chhatrapati Sambhajinagar, Maharashtra | After Union Minister Dharmendra Pradhan resigns, Anita Dipke, mother of Cockroach Janta Party’s Founding President Abhijeet Dipke, says, “I feel very happy today. It has been a wonderful day. I am extremely happy. He has finally… pic.twitter.com/gG53MhlO8H
— ANI (@ANI) July 25, 2026
తాజావార్తలు
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
-
Vijay – Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
-
Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!