CJP: మద్దతు ఇస్తాం, కానీ పాల్గొనబోం.. ప్రతిపక్షాల ర్యాలీపై అభిజిత్ దీప్కే..
- ఇండియా కూటమి ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు..
- మద్దతు ఇచ్చినప్పటికీ, పాల్గొనబోమని స్పష్టం..
- మమతా బెనర్జీని కలిసిన సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే శనివారం ఢిల్లీలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. తమ నిరసనలకు మద్దతు తెలిపినందుకు మమతకు దీప్కే కృతజ్ఞతలు చెప్పారు. ఎన్నికల సంఘంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై ఆదివారం నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి భారీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీకి CJP మద్దతు తెలుపుతున్నట్లు దీప్కే ప్రకటించారు. అయితే, ఈ ర్యాలీలో CJP నేరుగా పాల్గొనబోదని, తమ సంస్థ రాజకీయాలకు న్యూట్రల్‌గా ఉండాలని భావిస్తుందని ఆయన చెప్పారు.
తమ జంతర్ మంతర్ ఉద్యమానికి మమతా బెనర్జీ మద్దతు ఇచ్చారని, ఢిల్లీ పోలీసులు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను అరెస్ట్ చేసినప్పుడు కూడా అండగా నిలబడ్డారని దీప్కే అన్నారు. ఇదే సమయంలో CJP ప్రతిపక్షాల ర్యాలీలో పాల్గొంటుందా అనే ప్రశ్నకు దీప్కే స్పందిస్తూ.. ఆ నిరసనకు తమ మద్దతు ఉంటుందని, అయితే అధికారికంగా అందులో భాగస్వాములు కాబోమని చెప్పారు. ఎన్నికల అక్రమాలకు పాల్పడే ఏ సంస్థకైనా, రాజకీయ పార్టీకైనా తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు.
Also Read
- UP Elections: 350 స్థానాలు.. యూపీలో బీజేపీ టార్గెట్ ఫిక్స్..
- BJP Rally in Delhi: పొలిటికల్ దంగల్.. INDIA కూటమి ర్యాలీకి కౌంటర్‌గా బీజేపీ నిరసన.. 1984 సిక్కుల ఊచకోత బాధితులకు నివాళి!
- INDIA Bloc Rally in Delhi: INDIA కూటమి ‘ఓట్ బచావో, దేశ్ బచావో’ మహా ర్యాలీ.. 4 వేల మంది పోలీసులు మోహరింపు
- Income Tax Raid: భూమిలో పాతిపెట్టిన డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. ఏకంగా రూ.3.20 కోట్ల క్యాష్!
CJP మమతా బెనర్జీ ఆహ్వానం..
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో అభిజిత్ దీప్కే, ఇతర యువ కార్యకర్తల పోరాటాన్ని మమతా బెనర్జీ ప్రశంసించారు. సీజేపీ కార్యకర్తలు బెంగాల్ వచ్చి అక్కడ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొనేందుకు మమతా బెనర్జీ ఢిల్లీకి వచ్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
CJP: మద్దతు ఇస్తాం, కానీ పాల్గొనబోం.. ప్రతిపక్షాల ర్యాలీపై అభిజిత్ దీప్కే..
-
UP Elections: 350 స్థానాలు.. యూపీలో బీజేపీ టార్గెట్ ఫిక్స్..
-
Commercial LPG Price Hike: దీపావళికి ముందు షాక్.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు..
-
BJP Rally in Delhi: పొలిటికల్ దంగల్.. INDIA కూటమి ర్యాలీకి కౌంటర్‌గా బీజేపీ నిరసన.. 1984 సిక్కుల ఊచకోత బాధితులకు నివాళి!
-
Pulivendula Tension: పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీలపై దాడి!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!