CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదించాలని మోదీకి దీప్కే విజ్ఞప్తి.
- లేకపోతే ప్రధాని రాజీనామా డిమాండ్ కూడా వస్తుందని వ్యాఖ్య.
- ఎన్నికల్లో మీకు ఓట్లు వేయరని వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ తాజా హెచ్చరికలు జారీ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిని ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించకపోతే, అది మీ రాజీనామా డిమాండ్ వరకు వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ‘‘మోదీ జీ.. మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించండి. లేదంటే ఈ ఉద్యమం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మాత్రమే పరిమితం కాదు.. మీ రాజీనామాను కూడా డిమాండ్ చేసే దిశగా వెళ్తుంది’’ అని దీప్కే అన్నారు.
దేశంలో కోట్లాది మంది విద్యార్థుల కన్నా ఒక అసమర్థ, విఫల మంత్రి ముఖ్యం కాదని, అలాంటి మంత్రిని విద్యార్థుల కన్నా ముఖ్యుడని భావిస్తే, రాబోయే ఎన్నికల్లో ప్రజలు మీకు ఓటు వేయరని గుర్తుంచుకోండి అని వ్యాఖ్యానించారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని, పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ బాధ్యత వహించాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది.
Also Read
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
ఇదిలా ఉంటే, సమస్యను పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపింది. చర్చలకు ఏ సమయంలోనైనా సిద్ధంగా ఉన్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. జేపీ నడ్డా కార్యాలయం లేదా నివాసంలో చర్చలకు మీకు వీలైన సమయంలో సిద్ధంగా ఉన్నామని అన్నారు. మరోవైపు, తాము ఎక్కడికి రాబోమని ప్రభుత్వమే జంతర్ మంతర్ వచ్చి చర్చలు జరపాలని సీజేపీ డిమాండ్ చేస్తుంది. జంతర్ మంతర్ లేదా కానిస్ట్యూషన్ క్లబ్ లాంటి తటస్థ వేదికలపై చర్చలకు సిద్ధమే అని ప్రకటించింది. చర్చలు జరగాలంటే ముందుగా కేంద్రమంత్రిని తొలగించాలని షరతు విధిస్తోంది.
#WATCH | Delhi: Founding President of Cockroach Janta Party, Abhijeet Dipke says, "Modi ji, I once again request you to accept Dharmendra Pradhan's resignation. Otherwise, the issue will not remain limited to Dharmendra Pradhan's resignation alone; it will come for your… pic.twitter.com/H3pTqvx3TR
— ANI (@ANI) July 23, 2026
తాజావార్తలు
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్‌కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!