Raghav chadha: బీజేపీలోకి రాఘవ్ చద్దా..?
- ఆప్ తీవ్రమవుతున్న అంతర్గత పోరు..
- మొన్న స్వాతి మలివాల్, నేడు రాఘవ్ చద్దా..
- బీజేపీలో చద్దా చేరుతారంటూ ఆప్ నేతల ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghav chadha: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా, రాఘవ్ చద్దా ఎపిసోడ్ ఇందుకు సాక్షక్యంగా నిలుస్తోంది. రాజ్యసభలో ఆప్ ఉప నాయకుడి పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు చద్దా స్థానంలో పంజాబ్ రాజ్యసభ ఎంపీ అయిన అశోక్ మిట్టల్‌ను నియమించింది. దీంతో ఆయనను కావాలనే ఆప్ పక్కన పెడుతుందనే వాదన వినిపిస్తోంది. ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఆప్‌కు చద్దా సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు, ఆప్ ఢిల్లీ చీఫ్ సౌరభ్ భరద్వాజ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రధాని మోడీని, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా చద్దా ఎలాంటి అంశాలను లేవనెత్తలేదని అన్నారు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు చద్దా బయపడుతున్నారని మండిపడ్డారు. బీజేపీకి లొంగిపోయారని అన్నారు.
Read Also: Bihar: భూ మాఫియా వేధిస్తోంది.. ఉపముఖ్యమంత్రి ముందు కన్నీళ్లు పెట్టుకున్న సైనికుడు
Also Read
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
ఇదిలా ఉంటే, ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కీలక నేత ఆతిశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాఘవ్ చద్దా త్వరలోనే బీజేపీలో చేరుతారేమో..? అంటూ కామెంట్ చేయడం సంచలనంగా మారింది. దేశంలో రాజ్యాంగం, వ్యవస్థలపై దాడి జరుగుతోందని, బెంగాల్లో ఓట్ చోరీ జరుగుతోందని, ఎలక్షన్ కమిషన్‌ను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని, ఎల్పీజీ సంక్షోభం సహా ఎన్నో సమస్యలపై రాఘవ్ మాట్లాడలేదని, బీజేపీ మోడీలను ప్రశ్నించాలంటే ఆయనకు భయం అంటూ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చద్దా భయపడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ మీడియా చీఫ్ అనురాగ్ ధండా ఆరోపించారు. ఆప్‌లో స్వాతిమలివాల్ లాగే, రాఘవ్ కూడా తనను తాను ఆప్ నాయకుడిగా చెప్పుకుంటూ తిరుగుబాటు ధోరణిని అవలంభిస్తున్నారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఎంపీ స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ముందే అతడి పీఏ తనను కొట్టారంటూ ఆరోపించారు.
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!