పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది ఆమ్ ఆద్మీ పార్టీ.. దేశ రాజధాని ఢిల్లీకే పరిమితమైన ఆ పార్టీ.. మరో రాష్ట్రంలో గ్రాండ్ విక్టరీ కొట్టింది… ఇక, ఆప్ ప్రభంజనం ముందు.. సీఎం, మాజీ సీఎంలు.. ఏకంగా ఐదుసార్లు పంజాబ్ సీఎంగా సేవలందించిన నేతకు కూడా ఓటమితప్పలేదు.. మాజీ సీఎం, కురువృద్ధుడు ప్రకాశ్ సింగ్ బాదల్‌ను కూడా మట్టికరిపించింది ఆమ్ ఆద్మీ పార్టీ.. 94 ఏళ్ల బాదల్.. ఈ ఏడాది పంజాబ్ ఎన్నికల బరిలో నిలిచిన అత్యధిక వయస్సున్న వ్యక్తి.. ఇక, ఇప్పటి వరకు పంజాబ్ ముఖ్యమంత్రిగా ఐదు సార్లు పనిచేశారాయన.. 1969 నుంచి ఎన్నికల్లో ఓటమి ఎరుగని నేతగా రికార్డు సృష్టించారాయన.. కానీ, ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన గుర్మీత్ సింగ్ ఖుడియన్ చేతిలో ఆయనకు పరాజయం తప్పలేదు.
Read Also: Arvind Kejriwal: మార్పు మొదలు పెట్టాం.. పంజాబ్ ప్రజలు మ్యాజిక్ చేశారు..
శిరోమణి అకాలీదళ్ (SAD) జాతిపితగా మరియు ఐదుసార్లు మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ తన 65 ఏళ్ల రాజకీయ జీవితంలో ఓటమి పాలయ్యారు.. 94 ఏళ్ల బాదల్ పోటీ చేసిన 13వ రాష్ట్ర ఎన్నికలు ఇవి… గుర్మీత్ సింగ్ ఖుద్దియాన్పై 11,396 ఓట్ల తేడాతో ఓడిపోయారు. గురువారం మధ్యాహ్నం జరిగిన మొత్తం 13 రౌండ్ల కౌంటింగ్ తర్వాత ఖుద్దియాన్కు 66,313 ఓట్లను పోల్ కాగా.. బాదల్ తన సొంత గడ్డపై 54,917 ఓట్లు పొందాడు. కాంగ్రెస్ అభ్యర్థి జగ్పాల్ సింగ్ అబుల్ ఖురానాకు 10,136 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక, ప్రకాశ్ సింగ్ బాదల్ ఓటమిపై స్పందించిన ఆయన తనయుడు సుఖ్బీర్ సింగ్ బాదల్.. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆప్‌కు, ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్కు అభినందనలు తెలియజేశారు.