AAP: ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ.. బీజేపీ గూటికి ఢిల్లీ కౌన్సిలర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP councillor Pawan Sehrawat joins BJP: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్ కు చెందిన కౌన్సిలర్ పవన్ సెహ్రావత్ బీజేపీలో చేరారు. శుక్రవారం ఆయన బీజేపీ గూటికి చేరారు. సెహ్రావత్ బవానా వార్డు కౌన్సిలర్ గా ఉన్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నిమిషాల ముందు ఈ ప్రకటన వెలువడింది. బీజేపీలోకి చేరిన తర్వాత ఆప్ పై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) సభలో గందరగోళం సృష్టించేందుకు తనపై ఒత్తిడి తెచ్చారని సెహ్రావత్ ఆరోపించారు. ఆప్ రాజకీయాలు తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఆయన అన్నారు.
Read Also: Bengaluru: బెంగళూర్ నగరంలో అక్రమంగా 600 మంది విదేశీయులు తిష్ట..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు మేరకు బుధవారం ఆప్ పార్టీకి చెందిన షెల్లీ ఓబెరాయ్ మేయర్ గా ఎన్నికయ్యారు. 15 ఏళ్ల తరువాత బీజేపీ ఢిల్లీ కార్పొరేషన్ పై తన పట్టు కోల్పోయింది. ఇదిలా ఉంటే కొత్త మేయర్ ఎన్నిక తర్వాత ఆప్, బీజేపీ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దాడులు చేసున్నారు. బుధవారం రాత్రంతా ఎంసీడీ హాల్ లోనే బీజేపీ కౌన్సిలర్లు ఉన్నారు. ఈ గొడవల్లో హాల్ లోని కుర్చీలు, మైకులు, పోడియం విరిగిపోయాయి. దీంతో శుక్రవారం ఉదయం 10 గంటలకు సభ వాయిదా పడింది. ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికపై గందరగోళం మరియు నినాదాలు కొనసాగడంతో మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ సభ గురువారం రోజంతా వాయిదా పడింది.
ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ స్టాండింగ్ కమిటీ ఓటింగ్‌లో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని అనుమతించారు. బ్యాలెట్ గోప్యతకు భంగం వాటిల్లుతుందని, మొబైల్ వినియోగంపై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. ఈ గందరగోళం మధ్యే ఓటింగ్ కొనసాగింది. ఇదిలా ఉంటే తాజాగా ఆప్ పార్టీకి చెందిన కౌన్సిలర్ బీజేపీలోకి మారడంతో రాజకీయం రసవత్తంగా మారుతోంది.
Delhi | Aam Aadmi Party's Bawana councillor, Pawan Sehrawat, joins BJP pic.twitter.com/IYUFhxkEzV
— ANI (@ANI) February 24, 2023
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!