NTV Telugu Site icon

Arvind Kejriwal: కేజ్రీవాల్ కారుపై బీజేపీ దాడి.. ఆప్ ఆరోపణలు..

App

App

Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగింది. ఫిబ్రవరి 05న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బీజేపీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఇదిలా ఉంటే, శనివారం అరవింద్ కేజ్రీవాల్ ప్రయాణిస్తున్న కారుపై రాళ్ల దాడి జరిగింది. ప్రచారం చేస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని ఆప్ ఆరోపించింది. ఈ ఆరోపణలు ఆమ్, బీజేపీ మధ్య ఘర్షణకు కారణమైంది.

Read Also: Bhumana Karunakara Reddy: శ్రీవారి ఆలయ సమీపంలో గుడ్డు బిర్యాని.. ఇది టీటీడీ వైఫల్యమే..

ఓటమి భయం బీజేపీని పట్టుకుందని, ఆరవింద్ కేజ్రీవాల్‌పై దాడి చేయడానికి తన గుండాలను ఉపయోగించుకుంటోందని ఆప్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. బీజేపీకి చెందిన ప్రవేశ్ వర్మ, కేజ్రీవాల్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు తన మద్దతుదారులతో దాడి చేయించారని, ఢిల్లీ ప్రజలు తగిన సమాధానం ఇస్తారని ఆప్ ఆరోపించింది.

ఇదిలా ఉంటే, ఈ ఆరోపణల్ని బీజేపీ తిప్పికొట్టింది. కేజ్రీవాల్ కాన్వాయ్ ఇద్దరి వ్యక్తులపై దూసుకెళ్లిందని బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ ఆరోపించారు. కాన్వాయ్ దగ్గర నల్ల జెండాలనను ఊపుతున్న వ్యక్తులు వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్నారు. ఇది కేజ్రీవాల్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వక ప్రయత్నమని ఆప్ ఆరోపించింది.