NTV Telugu Site icon

Haryana Polls: రెండో జాబితాను విడుదల చేసిన ఆప్.. 9 మంది ప్రకటన

Appkejriwal

Appkejriwal

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే మరో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. మంగళవారం తొమ్మిది మందితో కూడిన రెండో జాబితాను ఆప్ విడుదల చేసింది. సోమవారం 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజా జాబితాతో కలిపి మొత్తం 29 స్థానాలకు అభ్యర్థులను ఆప్ వెల్లడించింది. హర్యానా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సొంత రాష్ట్రం. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 29 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 61 స్థానాలకు ఆప్ అభ్యర్థులను వెల్లడించాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Kamal Haasan : ఈ వయసులో క్లాసులకు వెళ్తున్న కమల్.. ఎందుకో తెలుసా?

కాంగ్రెస్‌తో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ బరిలోకి దిగాలని భావించింది. ఇందుకోసం పలుమార్లు రెండు పార్టీల మధ్య సుదీర్ఘ మంతనాలు జరిగాయి. అయినా కూడా చర్చలు ఫలించలేదు. ఆప్ 10 స్థానాలు కోరితే.. కాంగ్రెస్ మాత్రం సింగిల్ డిజిట్‌కే పరిమితం చేసింది. కేవలం 5-6 స్థానాల కంటే ఎక్కువ సీట్లు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. దీంతో ఆప్ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. సోమవారం 20 మందిని ప్రకటించగా.. మంగళవారం మరో 9 మంది అభ్యర్థులను వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Danam Nagender: పార్టీ ఫిరాయింపులు, అనర్హత పిటిషన్ పై కోర్టు తీర్పు.. స్పందించిన ఎమ్మెల్యే

కాంగ్రెస్, బీజేపీ కూడా రెండు జాబితాలను విడుదల చేసింది. మరో జాబితా విడుదలకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. అయితే ఎంపీలు.. ఎమ్మెల్యేలగా పోటీ చేస్తామని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో హైకమాండ్ తర్జనభర్జన పడుతోంది. త్వరలోనే కాంగ్రెస్ మూడో జాబితా కూడా విడుదల కానుంది. ఇక బీజేపీ కూడా మంగళవారం రెండో జాబితా విడుదల చేసింది. 21 మందితో కూడిన లిస్టును ప్రకటించింది. మొత్తం బీజేపీ 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి: NTR-Alia Bhatt: ‘దేవర కా జిగ్రా’.. మళ్లీ కలిసిన ఎన్టీఆర్‌, అలియా భట్!

Show comments