Site icon NTV Telugu

పంజాబ్‌లో ఉచిత విద్యుత్… ఆప్ కొత్త హామి…

వ‌చ్చే ఏడాది పంజాబ్ రాష్ట్రానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఈ ఎన్నిక‌ల్లో త‌న ముద్ర‌వేయాల‌ని అప్ పార్టీ చూస్తున్న‌ది.  ఇందులో భాగంగా పంజాబ్‌లో ఆప్ విజ‌యం సాధించి అధికారంలోకి వ‌స్తే ఉచిత విద్యుత్‌ను అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది.  చంఢీగ్ ప‌ర్య‌ట‌న‌కు ఒక‌రోజు ముందుగా ఆప్ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ఈ ప్ర‌క‌ట‌న చేశారు.  ఈ ప్ర‌క‌ట‌న‌తో పంజాప్ ఆప్ కేడ‌ర్ మ‌రింత ఉత్సాహంగా మారింది.  పంజాబ్ లో అధికారంలోకి వ‌స్తే 200 యూనిట్ల లోపు వినియోగించేవారికి ఉచితంగా విద్య‌త్ అందిస్తామ‌ని అన్నారు.  

ఈరోజు కేజ్రీవాల్ చంఢీగ్ వెళ్తున్నారు.  ఛండీగడ్ వేళ్లే ముందురోజు ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేశారు.  గ‌త పంజాబ్ ఎన్నిక‌ల్లో ఆప్ పార్టీ కొంత మేర ప్ర‌భావం చూపింది.  ఈసారి రైతుల ఉద్య‌మం విష‌యంలో ఆప్ కీల‌క పాత్ర పోషించింది.  పంజాబ్ నుంచి వ‌చ్చిన రైతుల‌కు కావాల్సిన ఏర్పాట్లు చేసింది ఆప్ ప్ర‌భుత్వం.  దీని ప్ర‌భావం రాబోయో ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా కనిపిస్తుంద‌ని ఆప్ న‌మ్ముతున్న‌ది.  కాంగ్రెస్ పార్టీలోని అంత‌ర్గ‌త విభేదాల‌ను ఆప్ పార్టీ స‌ద్వినియోగం చేసుకుంటుందా? 

Exit mobile version