Site icon NTV Telugu

Delhi: ఢిల్లీని ముంచెత్తిన వరద.. ప్రభుత్వ తీరుపై ఆప్ ధ్వజం.. వీడియోలు వైరల్

Raindelhi

Raindelhi

దేశ రాజధాని ఢిల్లీని వరదలు ముంచెత్తాయి. బుధవారం ఉదయం నుంచి కురిసిన వర్షానికి రహదారులన్నీ చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక డ్యూటీలకు వెళ్లే వారంతా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొ్న్నారు. ఇక నీరు వెళ్లే మార్గం లేక రహదారులపైనే నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఈతకొట్టుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇంకొన్ని చోట్ల మహిళలు రోయింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆప్ నాయకులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.

ఇది కూడా చదవండి: Delhi: చైనీయులకు శుభవార్త.. రేపటినుంచి టూరిస్ట్ వీసాలు ఇవ్వనున్న భారత్

ఒక్క వర్షానికి ఢిల్లీ నగరం మునిగిపోయిందని.. అధికార పార్టీ బీజేపీ ఏం చేస్తోందని ఆప్ నిలదీసింది. ఇందుకు సంబంధించిన వీడియోలను మనీష్ సిసోడియా, అతిషి సహా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ముఖ్య అనుచరులు పంచుకున్నారు. ‘‘ముఖ్యమంత్రి రేఖ గుప్తా జీ.. మీ దగ్గర సరైన ప్రణాళిక ఎక్కడ ఉంది? నీటి ఎద్దడిని ఎదుర్కోవడం గురించి మీరు మీడియాలో పెద్ద ఎత్తున వాదనలు చేశారు. కానీ నేడు ఢిల్లీ మొత్తం మునిగిపోతోంది. మీరు గొప్ప భవనంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రజలు ఇప్పుడు రోడ్లపై ఈత కొడుతున్నారు. బీజేపీ నాయకులందరినీ తమతో కలిసి ఈత కొట్టమని ఆహ్వానిస్తున్నారు.’’ అని ఆప్ పేర్కొంది. ఇక మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అయితే ఇది ‘‘ఉచిత జల క్రీడలు.’’ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Gorantla Madhav: ప్రజల్లో జగన్‌కు ఉన్న ఆదరణను చూసి తట్టుకోలేకే రాజకీయ వేధింపులు..

ఇక ఆప్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. 12 ఏళ్లుగా నీటి ఎద్దడి సమస్యపై గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని.. తమ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలే అయిందని.. సమస్య పరిష్కారం కోసం పని చేస్తున్నట్లు తెలిపింది.

 

Exit mobile version