Site icon NTV Telugu

Congress: అయోధ్య రామ మందిరం “బీజేపీ-ఆర్ఎస్ఎస్ పొలిటికల్ ప్రాజెక్ట్”

Jai Ram Ramesh

Jai Ram Ramesh

Congress: రామ మందిర వేడుకలపై మరిసారి కాంగ్రెస్, బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. జనవరి 22న రామ మందిర ప్రాణప్రతిష్ట వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరిలకు రామ మందిర ట్రస్ట్ ఆహ్వానం పంపింది. అయితే ఇది ఆర్ఎస్ఎస్/బీజేపీ కార్యక్రమని, తాము హాజరుకాబోవడం లేదని ఇప్పటికే కాంగ్రెస్ స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ఉన్న కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జ్ జనరల్ సెక్రటరీ జై రాం రమేష్ బుధవారం ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. రామ మందిర కార్యక్రమం ‘‘బీజేపీ-ఆర్ఎస్ఎస్ పొలిటికల్ ప్రాజెక్ట్’’ అంటూ దుయ్యబట్టారు. ఇది రాముడి రాజకీయం అంటూ మండిపడ్డారు. బీజేపీ ధర్మాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.

Read Also: Lufthansa Airlines: హైదరాబాద్ నుంచి జర్మనీ ఫ్రాంక్‌ఫర్ట్‌కి డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభం..

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రామ మందిరాన్ని రాజకీయాల కోసం వాడుకుంటుందని ప్రతిపక్ష ఇండియా కూటమి ఆరోపిస్తో్ంది. మరోవైపు బీజేపీ అంతే ధీటుగా కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలపై విరుచుకపడుతోంది. కాంగ్రెస్ యాంటీ-హిందూగా తయారైందని ఆరోపిస్తోంది. మతపరమైన మనోభావాలను కాంగ్రెస్ దెబ్బతీస్తోందని విమర్శించింది.

సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్‌సభలో ఆ పార్టీ ప్రతిపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌదరిలు ఇప్పటికే రామమందిర ఆహ్వానాన్ని తిరస్కరించారు. ప్రాణప్రతిష్ట తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వెళ్తానని సమాజ్ వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చెప్పారు.

Exit mobile version