Meghalaya: నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్ మార్చి 2న వెలువడబోతున్నాయి. ఇదిలా ఉంటే త్రిపురలో సొంతంగా బీజేపీ అధికారంలో వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేశాయి. దీంతో పాటు నాగాలాండ్ రాష్ట్రంలో మిత్రపక్షం ఎన్పీపీతో కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మేఘాలయలో బీజేపీకి సీట్లు తక్కువగా వచ్చే అవకాశం ఉందని అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
అయితే గతంలో ప్రభుత్వంతో భాగస్వామిగా ఉన్న బీజేపీ, మిత్రపక్షం నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ)ని కాదని ఈసారి ఎన్నికల్లో సొంతంగా బరిలో దిగింది. తాజా ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం ప్రస్తుతం ముఖ్యమంత్రి కన్నాడ్ సంగ్మా పార్టీ అయిన ఎన్పీపీకి మెజారిటీ సీట్లు సాధిస్తుందని, మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం లేదని చెబుతున్నాయి.
Read Also: Revanth Reddy: ఇసుకని అక్రమంగా దోచుకుంటున్నారు.. బండి సంజయ్, ఈటెల ఏం చేస్తున్నారు?
ఈ నేపధ్యంలో తన పాత మితపక్షం బీజేపీతో కలిసి ఎన్పీపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటికే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా గౌహతిలో సమావేశం అయినట్లు సమాచారం. మేఘాలయలో ఓట్ల లెక్కింపునకు ఒక రోజు ముందు, హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య ముఖ్యమంత్రి అర్ధరాత్రి అస్సాం కౌంటర్‌తో సమావేశమయ్యారని విషయం తెలిసిన వ్యక్తులు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-ఎన్పీపీ కలిసి కాంగ్రెస్ ను చిత్తు చేశాయి.
గౌహతిలోని ఓ హోటల్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం అయ్యారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ అక్కడి బీజేపీ+ఎన్పీపీ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ అర్థరాత్రి సమావేశం తరువాత సంగ్మా బుధవారం ఉదయం మేఘాలయలోని తన స్వస్థలం తురాకు తిరిగి వెళ్లారని తెలిసింది. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల వ్యూహకర్తగా బీజేపీ తరుపును హిమంత బిశ్వ సర్మ పనిచేస్తున్నారు. మేఘాలయలో ఎన్పీపీ, కాంగ్రెస్, త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీలతో జట్టుకట్టబోదని తెలుస్తోంది.
