Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ద్వారకలోని శబ్ద్ అపార్ట్‌మెంట్‌లో ఈ రోజు (జూన్ 10న) ఉదయం 10 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే, అపార్ట్‌మెంట్‌లోని ఆరో అంతస్తులో అగ్నికీలలు చుట్టుముట్టాయి. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ఆ భవనంలోని ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా కిందకు దూకేశారు.. దీంతో వారికి తీవ్ర గాయాలు అయ్యాయ. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక, సమాచారం అందుకున్న ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు సంఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా, అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Read Also: Janmabhoomi Express : తెలంగాణలో తప్పిన పెను ప్రమాదం.. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు ఇంజిన్ బ్రేక్‌డౌన్
అయితే, భవనంలోని ఇతర అంతస్తులకు కూడా మంటలు నెమ్మదిగా అంటుకుంటున్నాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. భవనం నుంచి భారీగా పొగ వెలువడుతుండటంతో.. సహాయక చర్యలకు అటంకం కలుగుతుందని పేర్కొన్నారు. ఇక, భవనం లోపల చిక్కుకున్న వారిని రక్షించడానికి అగ్నిమాపక సిబ్బంది అవిశ్రాంతంగా ప్రయత్నిస్తుంది.
STORY | Fire at housing apartment in Delhi's Dwarka; 8 tenders rushed
READ: https://t.co/MN5bQQfvZv https://t.co/dLwJtDJuUO
— Press Trust of India (@PTI_News) June 10, 2025