A Lawyer Cheated By Cyber Criminals In Orissa: ఒకవైపు సాంకేతికతను కొందరు మంచి పనుల కోసం వినియోగించుకుంటుంటే.. మరికొందరు చెడు పనులకు వాడుతున్నారు. ముఖ్యంగా.. సైబర్ నేరగాళ్లైతే ‘యాప్స్’ అప్డేట్ అవుతున్నట్టు, కొత్త పుంతలు తొక్కుతున్నారు. వినూత్నమైన మార్గాల్ని అనుసరిస్తూ.. ప్రజలకు కుచ్చటోపీ పెడుతున్నారు. చివరికి.. ప్రభుత్వ అధికారుల్ని కూడా వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు ఇద్దరు సైబర్ నేరగాళ్లు ఏకంగా న్యాయవాదికే శఠగోపం పెట్టారు. తెలిసిన వ్యక్తులమేనని నమ్మించి, అవసరానికి డబ్బు కావాలని రిక్వెస్ట్ చేసి.. రూ.30 వేలు లాగేసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Self Pleasure: లైంగిక ఆనందం కోసం ఆ తప్పు చేశాడు.. ఉంగరం ఇరుక్కొని ఆసుపత్రిపాలయ్యాడు
కొరాపుట్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బీరేష్ పట్నాయక్‌కు మంగళవారం ఉదయం 7750874432 నంబర్ నుంచి ఫోను వచ్చింది. తనని తాను దాస్ బాబుగా పరిచయం చేసుకున్నాడు. బీరేష్‌కు దాస్ బాబు అనే ఫ్రెండ్ ఉన్నాడు. అదే పేరు చెప్పేసరికి, తన స్నేహితుడే ఫోన్ చేసి ఉంటాడని భావించి, న్యాయవాది మాటలు కలిపాడు. ఆ క్రమంలో ఆ సైబర్ నేరగాడు ‘తాను ఆసుపత్రిలో ఉన్నానని, చికిత్స కోసం డబ్బులు అవసరం ఉన్నాయని, తాను ఇంట్లోనే పర్స్ మర్చిపోయానని చెప్పాడు. ఒక రోజులోగా డబ్బులు తిరిగిచ్చేస్తానని అన్నాడు. దీంతో.. ఆ న్యాయవాది తొలుత రూ.10 వేలు ఫోన్ పే ద్వారా పంపించాడు. కొద్దిసేపటికే మరోసారి ఫోన్ చేసి, ఇంకో రూ.10 వేలు అవసరం ఉందని అడిగేసరికి.. ఆ డబ్బులు కూడా ఫోన్ పే చేశాడు.
Actress Shobana: శోభన ఇంట్లో చోరీ.. ఆమె చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
కొద్దిసేపైయిన తర్వాత.. ఆ సైబర్ నేరగాడు ఆ న్యాయవాదికి ఫోన్ చేశాడు. తాను ఫోన్ పేలో మీ అకౌంట్‌కు రూ.30 వేలు పంపించానని చెప్పి, నకిలీ రసీదుని వాట్సాప్‌కు పంపించాడు. పొరపాటున రూ.10 వేలు అధికంగా పడ్డాయని, ఆ డబ్బు తిరిగి తనకు ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరాడు. దీంతో.. ఆ న్యాయవాది తన అకౌంట్‌లో నిజంగానే రూ.30 వేలు పడ్డాయో లేదో చూసుకోకుండా, ఆ వ్యక్తి చెప్పినట్టు మరో రూ.10 వేలు అతనికి పంపించాడు. డబ్బులు పంపించాక అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే, అందులో నగదు నమోదైనట్టు దాఖలాలు లేవు. వెంటనే ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే.. అది స్విచ్ఛాప్‌గా వచ్చింది. దాంతో తాను మోసపోయానని గ్రహించి.. న్యాయవాది పోలీసుల్ని ఆశ్రయించాడు.