BJP MP: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి లంచం తీసుకున్నారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ మహువాను విచారించింది. ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని సిఫారసు చేసింది. ప్రధాని మోడీ, అదానీ గ్రూప్‌ని టార్గెట్ చేస్తూ మహువా కావాలనే ప్రశ్నలు అడిగినట్లు తేలింది. ఇదే కాకుండా తన పార్లమెంట్ లాగిన్ వివరాలను వేరే వ్యక్తులతో పంచుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు.
Read Also: GPS Signal: మధ్యప్రాచ్యంలో జీపీఎస్ సిగ్నల్స్ కోల్పోతున్న విమానాలు.. భారత్ ఆందోళన..
ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత ఈ వ్యవహారంపై టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. కేంద్రం మహువాను లోక్ సభ నుంచి బహిష్కరించేందుకు ప్రయత్నిస్తోందని, ఇది తనకే ప్రయోజనం చేకూరస్తుందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరింత ప్రజాధరణ పెరుగుతుందని ఆమె అన్నారు.
దీదీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మండిపడ్డారు. ‘‘దావూద్ ఇబ్రహీం ఉత్తర్ ప్రదేశ్ లోని ఆజంగఢ్ నుంచి పోటీ చేస్తే 99 శాతం ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. అయితే మమతా సిద్ధాంతం ప్రకారం, దావూద్ ఇబ్రహీం దేశ ద్రోహి కాదా..?’’ అని నిషికాంత్ దూబే విమర్శించారు. మహువా కేవలం దర్శన్ హీరానందానీకి లాగిన్ వివరాలను మాత్రమే అందించలేదు. ఢిల్లీ, బెంగళూర్, శాన్‌ఫ్రాన్సిస్కో వంటి అనేక ప్రదేశాల నుంచి లాగిన్ చేయబడింది. ఇది పెద్ద కుట్ర అని అన్నారు. దావూద్ ఇబ్రహీం వంటి అవినీతిపరులు, దేశ ద్రోహులను ఇష్టపడటం ఇండియా కూటమి చరిత్ర అని దుయ్యబట్టారు. అంతర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం లాంటి వ్యక్తులు మమతా బెనర్జీకి ఫేవరెట్ అని దూబే ఆరోపించారు.