కొత్త సంవత్సరం ఉద్యోగులకు వరాల జల్లు కురిపించే అవకాశం ఉందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది కొత్త కమిషన్ తీసుకురానుందని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కీలక ప్రకటన వస్తుందని ప్రముఖులు అంచనా వేస్తున్నారు. 8వ వేతన సంఘం అమలు కోసం ఢిల్లీలో ఉద్యోగులు, పెన్షనర్ల ఉద్యమం చేస్తున్నారు. కొత్త వేతన సంఘంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని గత నెల రోజుల్లో వరుసగా రెండోసారి ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.. ఇక ఈ విషయాన్ని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశం ఉంది..
కాగా, ఇప్పటివరకు 8వ వేతన సంఘం రాదనే చర్చ జరిగింది. కానీ లోక్‌సభ ఎన్నికల తరుణంలో వేతన కమిషన్‌కు సన్నాహాలు జరుగుతున్నాయని భావిస్తున్నారు. దీనిపై కేంద్రం దృష్టి సారిస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొత్త వేతన సంఘం అమలు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘం అమలు తర్వాత ఉద్యోగులకు ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని ప్రముఖులు చెబుతున్నారు.. పే కమిషన్ కోసం ఎలాంటి ప్యానెల్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా ప్రకటించే ఛాన్స్ ఉంది.. దీనికోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.. గత కొద్ది రోజులుగా పోరాటాలు కూడా చేస్తున్నారు..
ఈ పే కమీషన్ వల్ల జీతం పెరగడంతో పాటు అనేక మార్పులు చోటు చేసుకొనే అవకాశం కూడా ఉంది.. 7వ వేతన సంఘంతో పోలిస్తే 8వ వేతన సంఘంలో ఉద్యోగులు డబుల్ జీతం అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ వార్త నిజమైతే వచ్చే ఏడాదిలో ఉద్యోగుల జీతాలు ఒకేసారి భారీ మొత్తం పెరగనున్నాయి. ఉద్యోగుల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.68 రెట్లు పెరగనుంది.. ఇక ఈ 8 వ పేలో పెరిగితే జీతాలు 44.44 శాతం పెరిగే అవకాశం ఉంటుంది.. మరి ఉద్యోగుల ఆశలను ప్రభుత్వం నెరవేరుస్తుందా లేదా అనేది చూడాలి..