Site icon NTV Telugu

Delhi: కర్తవ్యపథ్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి.. హాజరైన మోడీ, ఈయూ నేతలు

Delhi2

Delhi2

దేశ వ్యాప్తంగా ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు, అతిథులుగా ఈయూ నేతలు హాజరయ్యారు.

ఇక కర్తవ్యపథ్‌లో ఘనంగా పరేడ్ వేడుకలు జరిగాయి. వందేమాతరం థీమ్‌తో రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. 6,050 మంది సైనికులతో పరేడ్ నిర్వహించారు. 17 రాష్ట్రాలు, 13 కేంద్ర ప్రభుత్వ శకటాలు ప్రదర్శన ఇచ్చాయి. భారత వ్యోమగామి, ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ శుభాంషు శుక్లాకు భారతదేశపు అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారమైన అశోక చక్రను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.

 

Exit mobile version