NTV Telugu Site icon

Baghpat Platform Collapse: ఉత్తరప్రదేశ్లో కుప్పకూలిన వేదిక.. ఏడుగురు మృతి!

Up

Up

Baghpat Platform Collapse: ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. బాగ్‌పత్‌లో జైనులు ఏర్పాటు చేసిన ఆదినాథుడి నిర్వాణ లడ్డూ మహోత్సవ్.. ఈ కార్యక్రమంలో చెక్కతో ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. జైన శిష్యులు, పోలీసు సిబ్బందితో పాటు 60 మందికి పైగా గాయపడ్డారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తుంది. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు.

Read Also: Madha Gaja Raja: లైవ్ లో రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకున్న హీరోయిన్ లు..

ఇక, ఈ ప్రమాదంపై ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రియాక్ట్ అయ్యారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయడంతో పాటు గాయపడిన బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక, మనోవైపు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. విచారణ కొనసాగిస్తున్నారు.

UP: బాగ్పత్ లడ్డూ మహోత్సవంలో అపశృతి | Baghpat Stage Collapse | Ntv