Stray Dogs Attack: ఆరేళ్ల చిన్నారిపై వీధికుక్కల గుంపు దాడి.. బాలుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీధి కుక్కల దాడికి ఓ చిన్నారి బలైంది. ఉత్తరప్రదేశ్‌లో ఆరేళ్ల చిన్నారిపై ఓ కుక్కల గుంపు మూకుమ్మడిగా దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద నెలకొంది. రాష్ట్రంలో బరేలీలోని షేర్ఘర్ పట్టణంలోని 5వ వార్డులో చేదలాల్ తన భార్య, పిల్లలతో నివసిస్తున్నాడు. వారికి 6 ఏళ్ల కుమారుడు దక్షు ఉన్నాడు. బుధవారం బాలుడు పిల్లలతో కలిసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సమీపంలోని పొలంలో ఆడుకోవడానికి వెళ్లాడు. అక్కడ ఆడుకుంటుండగా చిన్నారులపైకి వీధికుక్కల గుంపు ఎగబడింది. దీంతో పిల్లలంతా భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో దక్షు పరుగెడుతూ కింద పడిపోవడంతో కుక్కల గుంపు అతడిపై దాడికి తెగబడ్డాయి.
Also Read: Deepika Padukone: దీపికా కూడా నెపోటిజం బాధితురాలేనా!.. హాట్‌టాపిక్‌గా హీరోయిన్ కామెంట్స్
Also Read
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
- Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
- SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
దీంతో ఆ బాలుడికి బలమైన గాయాలు అయ్యాయి. అతడి స్నేహితులు దక్షు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి వెళ్లిన వారికి దక్షు రక్తం మడుగులో కనిపించాడు. హుటహుటిన బాలుడిని ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు ధృవీకరించారు. దక్షు మరణవార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నివాస ప్రాంతాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కుక్కల దాడి ఘటనలు చాలా జరిగాయని, అయినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. వెంటనే తమ గ్రామంలో కుక్కల బెడదను నివారించాలంటూ వారు ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.
Also Read: Snake Robot: నాసా కోసం స్నేక్ రోబోట్.. ఇండియన్ సైంటిస్ట్ ఘటన..
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!