Site icon NTV Telugu

Delhi: విషాదం.. గుండెపోటుతో ఆరేళ్ల చిన్నారి మృతి

Boy Died By Cardiac Arrest

Boy Died By Cardiac Arrest

దేశ రాజధాని ఢిల్లీలో విషాద ఘటన చోటు చేసుకుంది. బంధువుల పెళ్లికి వచ్చిన ఆరేళ్ల చిన్నారి గుండెపోటుతో మృతి చెందని ఘటన ఢిల్లీలో సోమవారం జరిగింది. వివరాలు.. మధ్యప్రదేశ్‌కు చెందిన విహాన్ జైన్ తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీలోని తన బంధువుల పెళ్లి వేడుకకు వచ్చాడు. సోమవారం బంధువులంతా పెళ్లి వేడుకలో ఆనందంగా పాల్గొన్నారు. ఈ క్రమంలో విహాన్ సడెన్‌గా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో తల్లిదండ్రులు అతడిని ఢిల్లీలోని స్థానిక ఆస్పత్రికి తీసుకేళ్లారు. అస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా విహాన్ మరణించాడు. దీంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా విహాన్ మయెకార్టిటిస్ (గుండె కండరాల వాపు) వల్లే చనిపోయాడని వైద్యులు ధవీకరించారు.

Also Read: Raghunandan Rao: 171 ఓట్లతో గెలిచిన కేటీఆర్.. 1700 ఓట్లతో గెలిచిన నన్ను ఎక్కిరిస్తుండు

దీనివల్ల గుండెలో గండలు ఏర్పడి శరీరానికి రక్త సరఫరా ఆగిపోతుంది. దీంతో గుండెపోటు వస్తుందని వైద్యులు తెలిపారు. దానివల్ల విహాన్ మృతి చెందాని వైద్యులు వెల్లడించారు. కాగా ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు సంఖ్య పెరిగిపోతుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హార్ట్ ఎటాక్‌కు బలి అవుతున్నారు. ఒకప్పుడు 60పై బడిన వారిలో మాత్రమే గుండె సమస్యలు కనిపంచేవి.. కానీ ప్రస్తుతం కాలంలో గుండెపోటు వ్యాధులు వయసుతో సంబంధం లేకుండ వస్తున్నాయి. వీటికి ఆరోగ్య సమస్యలు ఒకట కారణమైతే.. మానసిక ఒత్తిడి, ఆహారపు ఆలవాట్లు కూడా ఒక కారణమంటున్నారు వైద్యులు. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, ప్రతిరోజూ మెడిటేషన్, యోగ వంటి ఫిజికల్ యాక్టివిటిస్ చేయాలని వైద్యులు సూచిస్తూన్నారు.

Also Read: Mohan Bhagwat: అప్పుడు అమెరికా మనల్ని ఎగతాళి చేసేది.. ఇప్పుడు పాకిస్థాన్‌..?

Exit mobile version